Jayaprakash Narayanan : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక రేపు పోలింగ్ జరగనుంది. అయితే పోలింగ్ సందర్బంగా మేధావులు, బుద్ది జీవులు, ప్రజాస్వామిక వాదులు ఓటు హక్కు వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున ఓటర్లను కోరుతున్నారు. పని చేసే వాళ్లకు, అభివృద్దిని చూసి విలువైన ఓటు వేయాలని పిలుపునిచ్చారు లోక్ సత్తా పార్టీ కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ్. ఎలాంటి వారిని ఎన్నుకోవాలి.. ఎలాంటి పార్టీని గెలిపించాలన్న విలువైన విషయాలను జయప్రకాశ్ నారాయణ్ వివరించారు. ఓటన్నది కేవలం కోపంతోనో, కసితోనో వేసేది కాదని.. డబ్బు ప్రలోభంతోనో.. రేపు ఏదో ఇస్తాడన్న ఆశతోనో వేసేది అంతకన్నా కాదని చెప్పుకొచ్చారు జేపీ. ఓటనేది మన భవిష్యత్తును నిర్ణయించేదని.. రేపు ఏం జరగనుందని ఆలోచించి తీసుకోవాల్సిన అత్యంత విలువైన నిర్ణయమని వివరించారు.
డబ్బులతో ఓట్లు కొనటం అందరూ చేసే పని అన్న జయప్రకాశ్ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు అదే పని చేస్తున్నారని.. బడితే ఉన్నవాడితే బర్రె అయిపోయిందని జేపీ అభిప్రాయపడ్డారు. అధికార దుర్వినియోగం జరుగుతోందని.. అవినీతి జరుగుతోందని తెలిపారు. అధికారమంతా కేంద్రీకరించి చేతుల్లో పెట్టుకుంటున్నారన్నారు. ఇలాంటి సమయంలో.. ఒకే ఒక ఆశాకిరణం కనబడుతోందని జేపీ తెలిపారు. మౌలిక సదుపాయలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పన, ఆదాయ పెంపులాంటి అంశాలతో ఆర్థిక ప్రగతిని పెంపొందించాలని తెలిపారు. అయితే.. ఎవరు దీనికి దోహదం చేస్తున్నారని ఆలోచించాలని జేపీ తెలిపారు.
డబ్బంతా కేవలం తాత్కాలిక అవసరాలకే ఖర్చు పెట్టి.. రేపు ఏమీ లేకుండా చేసేవాళ్లు భవిష్యత్‌కి పెద్ద ప్రమాదం అవుతారు. ఎవరివల్ల ఉద్యోగాలు వస్తాయి.. పెట్టుబడులు పెరుగుతాయి.. మౌలిక సదుపాయాలు మెరుగుపడుతాయని ఆలోచించి వేటు వేయాలని అయన అన్నారు. ఎన్నికల పర్వం ముగిసిపోగానే పనైపోలేదని.. ఎవరు వచ్చినా ఆర్థిక ప్రగతి చేపట్టే అంశంపై దృష్టి పెట్టేలా చేయాలన్నారు. అంతేకానీ.. కేవలం తాత్కాలికంగా తాయిలాలు ఇచ్చేవారికి ఓటు వేయొద్దని చెప్పారు. ఎవరు అధికారంలోకి వచ్చినా హుందాగా స్వీకరించాలని.. వచ్చిన వారిని జవాబుదారిగా పనిచేసేలా చేసేందుకు యువత నడుం బిగించాలని జేపీ తెలిపారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…