Janasena Leaders : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వారాహి యాత్రలో వైసీపీ నాయకులపై విమర్షల వర్షం గుప్పించారు జనసేనాని. ఇక తాజాగా తిరుపతిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించిన విషయం తెలిసిందే. శ్రీకాళహస్తిలో జనసేన నేత కొట్టే సాయిపై సీఐ దాడి, అనుచిత వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి ఆయన తిరుపతి వెళ్లారు.శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే సీఐ చేయిచేసుకున్నారని పవన్ తెలిపారు.
ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే అన్నారు. సుమోటోగా కేసు తీసుకున్నందుకు మానవ హక్కుల కమిషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇక సేనాని పర్యటన సందర్భంగా.. అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గరి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సేనానికి కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌కి ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలతో కలిసి సేనాని.. ర్యాలీగా ఎస్పీ ఆఫీసుకు బయలుదేరారు. ఎస్పీ కార్యాలయానికి బయలుదేరిన సేనానికి ప్రజలు నీరాజనం పట్టారు. జనసేన అధినేతను చూడటానికి కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు.
క్రౌడ్ ను కంట్రోల్ చేయడానికి అధికారులు అదనపు బలగాలను రప్పించారు. పవన్ కళ్యాణ్ కి తిరుపతిలో ఉన్న క్రేజ్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. రోజా సైతం పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయిందట. ఈ రేంజ్‌లో పవన్ కి స్వాగతం లభిస్తుందని ఆమె భావించనట్టు తెలుస్తుంది. జనసేనాని రాకతో తిరుపతి జనసేన పార్టీలో నూతనోత్సాహం వచ్చింది. కార్యకర్తపై చేయి చేసుకుంటేనే స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో.. పార్టీలో జోష్ నిండింది. ఇక పవన్ పై స్థానిక వైసీపీ, టీడీపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.