తెలంగాణ రాష్ట్రంలో వచ్చేఎన్నికలకు జనసేన పార్టీ రెడీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఎన్నికల బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికలలో 32 స్థానాలలో పోటీ చేయడానికి జనసేన సిద్ధమైంది. అయితే ఈ సమయంలో తనపై చాలా ఒత్తిడి ఉందని పవన్ కళ్యాణ్ తెలంగాణ పార్టీ శ్రేణులతో భేటీ నిర్వహించి వారి అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరారు. దీంతో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసినదేనని తెలంగాణ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు.
ఈ భేటిలో అందరూ అభ్యర్థులు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని, వెనక్కు తగ్గొద్దు అని పవన్ కళ్యాణ్ కు సూచించారు. ఎన్నాళ్ళ నుండో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని, ఈ దఫా పోటీ చెయ్యకపోతే తెలంగాణలో పార్టీ ఎదుగుదలను చేతులారా ఆపుకున్నట్టే అని అభిప్రాయపడ్డారు. 2018లో కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో పోటీ చేయరాదన్న అధ్యక్షుడి నిర్ణయాన్ని గౌరవించి మేము కూడా పోటీ చేయలేదని. కానీ మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ నుండి విరమించుకున్నామని ఓ జనసేయ నాయకుడు అన్నారు.
అయితే ఈ సారి మాత్రం తప్పనిసరిగా పోటీ చెయ్యాల్సిందేనని ముక్త కంఠంతో కోరారు. ఇప్పుడు పోటీ చెయ్యకుంటే ప్రజల ముందుకు భవిష్యత్ లో బలంగా వెళ్ళటం కష్టమేనని, క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని స్పష్టం చేశారు. పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉన్న కారణంగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. అయితే అందరి నేతల అభిప్రాయాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తానూ అర్ధం చేసుకోగలనని,అయితే తన మీద ఉన్న ఒత్తిడి వాస్తవమేనని, అయితే నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానంటూ తెలియజేశారు. సరైన నిర్ణయం తీసుకోవటానికి రెండు రోజుల సమయం అవసరం కావాలని పవన్ అన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని పవన్‌ను కోరారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…