Kodali Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కొడాలి నాని పంచ్‌లు.. ప‌డిప‌డి న‌వ్వ‌డం ఖాయం..!

Kodali Nani : చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత ఏపీలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతుంది. రోజురోజుకి ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటూ నానా హంగామా సృష్టిస్తున్నారు. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని అయితే చంద్ర‌బాబు, లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తెగ విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం విజయవాడ జగ్గయ్య పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసేందుకు విజయవాడకు రోడ్డు మార్గంలో బయల్దేరారు. అయితే ఆయనను గరికపాడు చెక్ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అతను మొదట ఎయిర్‌వేస్ ద్వారా ఆంధ్రాకు చేరుకోవడానికి ప్రయత్నించాడు, కాని కృష్ణా జిల్లా పోలీసులు తన ప్రత్యేక విమానం గన్నవరం విమానాశ్రయానికి హైదరాబాద్ నుండి బయలుదేరకుండా చూసుకున్నారు.

రహదారి మార్గంలో వెళ్లాలని ప‌వ‌న్ భావించ‌గా, ఎన్టీఆర్ జిల్లాలో అతని కాన్వాయ్ రెండుసార్లు బ్లాక్ చేయబడింది, దీంతో ప‌వ‌న్ కళ్యాణ్ తన వాహనం నుండి దిగి విజయవాడలోని మంగళగిరి వైపు నడిచాడు. విజయవాడ వైపు వెళ్లకుండా అడ్డుకోవడంతో కళ్యాణ్ అనుమంచిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించారు. కళ్యాణ్‌, మనోహర్‌లను ప్రివెంటివ్‌ కస్టడీలోకి తీసుకున్నామని, వారిని విజయవాడకు తీసుకెళ్తున్నామని నందిగామ సబ్‌డివిజనల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ జనార్దన్‌ నాయుడు తెలిపారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌ని ముందుకు క‌ద‌ల‌నివ్వ‌కుండా ఉంచ‌డంపై నిర‌స‌న‌గా రోడ్డుపై ప‌డుకొని నిర‌స‌న తెలియ‌జేశాడు.

Kodali Nani strong counter to pawan kalyan
Kodali Nani

తాజాగా దీనిపై కొడాలి నాని స్పందించారు. ప‌వ‌న్ కళ్యాణ్ వ‌స్తే జ‌డ్జిగారిని భ‌య‌పెట్టి బెయిల్ ఇప్పించేవాడు. అస‌లు చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత ఆయ‌న కొడుకు లోకేష్‌, భార్య భువ‌నేశ్వ‌రి, కోడ‌లు బ్రాహ్మ‌ణి అంద‌రు బాగానే ఉన్నారు. ఏసీ కార్ల‌లో తిరుగుతున్నారు. మ‌రి ఈయ‌న ఎందుకు రోడ్డు మీద ప‌డుకున్నాడో జ‌నానికి అర్ధం కావ‌డం లేదు. చంద్ర‌బాబు నాయుడు ఇన్ని రోజులు జైలులో ఉన్నప్పుడు ఎంత‌మంది లాయ‌ర్ల‌ని తీసుకొచ్చాడు. లాయ‌ర్ అంటాడు, 24 గంట‌లు దాటింది కాబ‌ట్టి బెయిల్ ఇచ్చేయాల‌ని అంటాడు, మ‌రొకడు గ‌వ‌ర్న‌ర్ ప‌ర్మీష‌న్ తీసుకోలేదు కాబ‌ట్టి బెయిల్ ఇచ్చేయాల‌ని అంటాడు. ఇవా వీళ్లు చేసేద‌ని కొడాలి నాని క‌డిగిప‌డేశాడు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago