Irfan Pathan : ఆఫ్ఘనిస్తాన్ టీంతో ఇర్ఫాన్ పఠాన్‌కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ గెలిచినప్పుడల్లా వారిని ఎంతో ప్రోత్సహిస్తుంటాడు. పురుషుల వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్‌పై తొలి విజయాన్ని నమోదు చేసిన ఆఫ్ఘనిస్థాన్‌కు ఇర్ఫాన్ అభినందనలు తెలిపాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. పాక్ స్పిన్, పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. 49వ ఓవర్‌లో షాహిన్ షా అఫ్రిది వేసిన చివరి బంతిని హస్మతుల్లా బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీకి పంపి విన్నింగ్ షాట్ కొట్టారు.
ఇక ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఇంట్లో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్ల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో హర్భజన్ సింగ్, అద్నాన్ సమీ, ప్రముఖ నటుడు సునీల్ శెట్టి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అందుకు సంబంధించి అద్నాన్ సమీ ట్విట్టర్లో ఒక ఫోటోను షేర్ చేశారు. ఇర్ఫాన్ పఠాన్ ఇంట్లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆటగాళ్లతో అందమైన సాయంత్రం’ అని అద్నాన్ ఫోటో షేర్ చేసి క్యాప్షన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తూ పిక్స్ తెగ వైరల్ చేస్తున్నారు.
ప్రపంచకప్ 2023 సెమీఫైనల్స్ సమీపిస్తోంది. ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు తొలి రెండు సెమీస్ స్థానాల్ని ఖరారు చేసుకోగా, ఆఫ్ఘనిస్తాన్‌పై ఊహించని విజయంతో ఆస్ట్రేలియా మూడవ సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఇక నాలుగో స్థానం కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఆస్ట్రేలియాపై ఓటమి కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో సమానంగా అవకాశాలు మిగుల్చుకుంది. ఆఫ్ఘనిస్తాన్ చివరి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే పది పాయింట్లతో మిగిలిన జట్లతో రేసులో నిలబడుతుంది. ఆస్ట్రేలియాపై గెలిచి ఉంటే ఆప్ఘన్‌కు మరింత అనుకూలమైన పరిస్థితి ఉండేది. కానీ అనుకోని పరాజయంతో ఇతర జట్లతో సమానంగా అవకాశాలు మిగిలాయి. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే దక్షిణాఫ్రికాపై గెలవడమే కాకుండా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఓడిపోవడం లేదా ఈ రెండింటితో రన్‌రేట్ ఎక్కువ కలిగి ఉండటం అవసరం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…