Irfan Pathan : వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే డిపెండింగ్ ఛాంపియన్‌ను మట్టి కరిపించిన ఆ జట్టు తాజాగా పొరుగు దేశం పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. సోమవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది అఫ్గన్. పాక్ విధించిన 283 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్ (65), ఇబ్రహీం జద్రాన్ (87), రహ్మత్ షా (77) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. తమ జట్టుకు మర్చిపోలేని విజయాన్ని అందిస్తారు. ఏ ఫార్మాట్‌లో నైనా పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి వన్డే వియం. అందుకే మ్యాచ్ పూర్తయిన తర్వాత అఫ్గన్ ఆటగాళ్ల అంబరాలు సంబరాన్నంటాయి.
చెపాక్ జమైదానం అంతటా తిరుగతూ తమను ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ తమ జాతీయ పతకాన్ని చేత పట్టుకుని మైదానం అంతా కలియ తిరిగాడు. ఇదే సందర్భంలో అక్కడ కామెంటరీ చేస్తోన్న ఇర్ఫాన్ పఠాన్ ఎదురుకావడంతో అతనితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇలా ఖాన్, పఠాన్ లిద్దరూ స్టెప్పులేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గెలుపు అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ గ్రౌండ్‌లో కలియతిరిగిన ఆఫ్ఘన్ ఆటగాళ్లను ఇర్ఫాన్ పఠాన్ అభినందించాడు. రషీద్ ఖాన్‌తో కలిసి మైదానంలోనే డ్యాన్స్ చేశాడు. ఆ వెంటనే రషీద్‌ను ఆలింగనం చేసుకొని మెచ్చుకున్నాడు. అద్భుతంగా ఆడారంటూ ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లతో సంభాషించాడు. పలువురితో కరచాలనం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ మొదట 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్ని అందుకుంది. 283 పరుగుల ఛేజింగ్‌లో ఆఫ్ఘన్ టాపార్డర్ అదరగొట్టింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్ తొలి వికెట్ కు 130 పరుగులు జోడించి సరైన పునాది వేయగా… రహ్మత్ షా, కెప్టెన్ హష్మతుల్లా షాహిది మిగతా పని పూర్తి చేశారు.