IPL 2024 : క్వాలిఫైర్ 2లో రాజ‌స్థాన్ ఓడిపోయింది అందుకే..!

IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో ఎవ‌రు క‌ప్ కొడ‌తారు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. మొద‌టి నుండి అద్భుతంగా ఆడిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌లో ఓడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో హైదరాబాద్ 36 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. SRH 6 సంవత్సరాల తర్వాత ఈ లీగ్‌లో ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు 2018లో ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. మే 26న ఈ సీజన్ ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సంజూ శాంసన్.. డ్యూ రాకపోవడం, పిచ్ పూర్తిగా మారిపోవడం తమ ఓటమిని శాసించిందని చెప్పాడు.

ఇదొక బిగ్ మ్యాచ్. మా బౌలింగ్ ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా. బ్యాటింగ్ వైఫల్యం మా ఓటమిని శాసించింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో సన్‌రైజర్స స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మా దగ్గర ఆప్షన్స్ లేవు. అదే మా పతనాన్ని శాసించింది. డ్యూ వస్తుందని మేం ఆశించాం. కానీ రాలేదు. ఇక మేం ఊహించిన విధంగా పిచ్ లేదు. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో పూర్తిగా మారిపోయింది. బంతి బాగా టర్న్ అయ్యింది. ఈ అడ్వాంటేజ్‌ను సన్‌రైజర్స్ స్పిన్నర్లు అద్భుతంగా వాడుకున్నారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో మా కుడి చేతి బ్యాటర్ల‌ను పెవిలియన్ చేర్చారు. అక్కడే ఆటలో పైచేయి సాధించారు అని చెప్పుకొచ్చాడు.ఇక అదే కాకుండా టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించిన సంజూ శాంసన్, పరాగ్ డూ ఆర్ డై మ్యాచ్‌లో మాత్రం వీరిద్దరూ విఫలమయ్యారు. సంజు 11 బంతుల్లో కేవలం 10 పరుగులు చేయగా.. పరాగ్ 10 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

IPL 2024 these are the reasons for rajasthan royals loss
IPL 2024

ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ తన సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 4 ఓవర్లు వేసిన ఆశ్విన్ 43 పరుగులు సమర్పించారు. ఇక స‌న్ రైజర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ త‌న వ్యూహాన్ని ప‌క్కాగా అమ‌లు ప‌రిచాడు. సరైన సమయంలో స్పిన్ బౌలర్లను రంగంలోకి దించారు. ఏ మాత్రం ఊహించని విధంగా ఈ సీజన్‌లో తొలిసారి అభిషేక్ శర్మతో బౌలింగ్ వేయించారు. . అభిషేక్ తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 24 పరుగులిచ్చి 2 పెద్ద వికెట్లు తీశాడు. కమిన్స్ ఇలాంటి వ్యూహాం అమలు చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇక ఇది కాకుండా టామ్ కోహ్లర్-కాడ్మోర్‌కు రాజ‌స్థాన్ మంచి అవ‌కాశం ఇచ్చిన అతను చ‌క్క‌గా వినియోగించుకోలేక‌పోయాడు. పవర్‌ప్లేలో వచ్చిన అతడు కేవలం 16 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago