జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

సీఎం జగన్ పై దాడి కేసులో కోడికత్తి శ్రీను పై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కేసులో విచారణ పూర్తైందని ఎన్ఐఏ చెబుతున్నా కేసు విచారణ జాప్యం అవటానికి కారణాలు ఇవేనంటూ శ్రీను లాయర్ సలీం చెబుతున్న విషయాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ కు కోడికత్తిని అందించింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అని సలీం ఆరోపించారు. దినేశ్ కుమార్ కు మజ్జి శ్రీనివాసరావు కోడికత్తిని ఇచ్చాడని, అయితే ఆ నేరాన్ని శ్రీనుపై మోపారని చెప్పారు. కావాలనే ఎన్ఐఏ కోర్టు విచారణకు జగన్ హాజరు కావడం లేదని… విచారణకు జగన్ హాజరైతే అన్ని వివరాలు బయటపడుతాయని అన్నారు.

కోడికత్తి దాడిలో ఎలాంటి కుట్ర లేదని ఎన్ఐఏ గతంలోనే చెప్పిందని సలీం తెలిపారు. రాజకీయాల కోసమే ఈ కేసును సాగదీస్తున్నారని చెప్పారు. మరోవైపు జగన్ కోర్టుకు వచ్చి, ఎన్ఓసీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖలో నిన్న నిరసన కార్యక్రమం చేపట్టాలని దళిత సంఘాల ఐక్య వేదిక నిర్ణయించింది. అయితే నిరసన కార్యక్రమం ప్రారంభం కాకముందే దళిత సంఘాల నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.జగన్‌పై సెక్షన్‌ 189 ప్రకారం కేసు పెట్టే అవకాశం ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. జగన్‌ హైదరాబాద్‌లో దిగగానే అంబులెన్స్‌ వచ్చి ఆస్పత్రికి తీసుకువెళ్లింది. ఇవన్నీ పథకంలో భాగంగానే జరిగాయి’’ అని సలీమ్‌ పేర్కొన్నారు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతానన్న జగన్‌ ఇప్పుడు ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆయనకు చట్టంపై విశ్వాసం లేదని, అందుకే ‘రావాలి జగన్‌.. చెప్పాలి సాక్ష్యం’ అని డిమాండ్‌ చేస్తున్నానని తెలిపారు.

interesting details on kathi seenu

నిందితుడి తరఫున కోర్టులో వాదనలు వినిపించిన సలీమ్‌.. బుధవారం కూడా ఇక్కడే ఉన్నారు. తనను కలిసిన మీడియాతో ఆయన కేసు వివరాలు పంచుకున్నారు. ‘‘కోడికత్తి ఘటన జరిగిన విశాఖ విమానాశ్రయంలో అసలేం జరిగిందనేది పూర్తి చరిత్ర, దానికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కోడికత్తి దాడి పథకం విజయవంతమైతే సానుభూతి వెల్లువెత్తి జగన్‌ సీఎం అవుతారని వారు ముందుగానే ఊహించారు. ఆ తర్వాత అదే నిజమైంది. ఇప్పుడు జగన్‌ సీఎం సీట్లో ఉన్నారు. అసలు జగన్‌పై ఏ ఆయుధంతో దాడి జరిగిందనే విషయం ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు బయటపడలేదు అని ఆయ‌న చెప్పారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago