Akira Nandan : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన పిల్లలకు సంబంధించిన వీడియోలతో పాటు తన వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా రేణూ అకీరాకి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఇందులో అకీరా తన తల్లితో ఫన్నీగా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. రేణూతో అకీరా మమ్మి అంటూ నానా రచ్చ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ మురిసిపోతున్నారు. గత కొద్ది కాలంగా అకీరా నందన్ తెగ వార్తలలో నిలుస్తున్నాడు. ఇటీవల బ్రో మూవీ థియేటర్‌లో కూడా సందడి చేశారు. అప్పుడు అకీరా చుట్టూ గుమిగూడారు జనాలు. అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అయ్యాయి.
రేణు దేశాయ్ కొడుకు అకీరా కృత్రిమ మేధ ఆధారంగా రెండు ఆమె ఫోటోలు రూపొందించాడు. సదరు ఫోటోలను రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో వీడియో రూపంలో పోస్ట్ చేశారు. అకీరా నా ఫోటోలు AI లో ఇలా సృష్టించాడంటూ కామెంట్ పెట్టిన, రేణు దేశాయ్, ఇది ఒకరకంగా భయపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రేణు దేశాయ్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.అకీరా ప్రస్తుతం టీనేజ్ లో ఉన్నాడు. ఒక ప్రక్క చదువుకుంటూనే మరోపక్క కళలు నేర్చుకుంటున్నాడు. మ్యూజిక్ లో అకీరా ప్రావీణ్యం సాధించాడు. పియానో అద్భుతంగా ప్లే చేస్తాడు. అప్పుడే ఓ షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ కంపోజ్ చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అకీరా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. అకీరా హీరో కావాలని ఆశపడుతున్నారు. అయితే అకీరా పవన్ వారసుడు అంటే రేణూ దేశాయ్ కి నచ్చదు. ఆమె ఫైర్ అవుతారు.
ఇటీవల “నా మనవడు కార్తికేయ, పవన్ కుమారుడు అకీరా నందన్.. ఇద్దరూ అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరారు’’ అని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇటీవల ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌ను ఆయన కొద్ది సేపటికే తొలగించడం గమనార్హం. కానీ అప్పటికే ఈ ఫొటో వైరలైంది. అభిమానులంతా మరికొద్దిరోజుల్లో అకీరాను బిగ్ స్క్రీన్‌పై చూడనున్నామని సంబరపడుతూ.. ఫొటోను షేర్ చేస్తున్నారు. దీనిపై రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాలో స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతానికి అకీరాకు నటనపై ఆసక్తి లేదు. హీరో కావాలని అనుకోవడం లేదు. భవిష్యత్తులో తన నిర్ణయం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఏదైనా పోస్ట్ చేసిన వెంటనే దానికి సంబంధించిన ఊహాగానాలు ఆపేయండి. ఒకవేళ అకీరా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే.. ఆ విషయాన్ని నేను మీతో కచ్చితంగా పంచుకుంటాను’’ అని క్లారిటీ ఇచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…