IND Vs WI 2023 : ఈ ఏడాది అక్టోబర్‌లో వరల్డ్ కప్ మొదలు కానున్న విషయం తెలిసిందే . అయితే వరల్డ్ కప్ ముందు సుదీర్ఘ విరామం తర్వాత విండీస్ జట్టు భారత్‌తో టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వారం రోజుల ముందే కరేబియన్ దీవులకు చేరుకున్న టీమిండియా అక్కడ మూడు ఫార్మాట్లలో తలపడనుంది. వెస్టిండీస్‌తో భారత్ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ ఆడనుంది. జులై 12 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌లు ఎందులో చూడాలని చాలా మందిలో ఓ సస్పెన్స్ ఉంది. అయితే ఇండియా వెస్టిండీస్ సిరీస్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, సోనీ నెట్‌వర్క్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. బదులుగా, టీవీలో చూడాలనుకుంటే DD స్పోర్ట్స్‌లో మాత్రమే చూడవచ్చు. జియో స్పోర్ట్స్‌లో కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు.
భారత కరేబియన్ టూర్‌లోని టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్‌లు దూరదర్శన్ నెట్‌వర్క్ DD స్పోర్ట్స్‌లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం కానుంది. అంతే కాకుండా, ఆన్‌లైన్ వీక్షకులు జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ యాప్ ద్వారా చూడవచ్చు. నెల రోజుల ఈ పర్యటనలో భారత్.. వెస్టిండీస్‌తో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడుతుంది. టెస్టు సిరీస్‌తో భారత్ పర్యటన ప్రారంభం అవుతుంది. డొమినికాలోని విండ్సర్ పార్క్ స్పోర్ట్స్ స్టేడియంలో జూలై 12 నుంచి జూలై 16 వరకు తొలి టెస్టు జరుగనుంది. ఇక రెండో టెస్టు మ్యాచ్.. జూన్ 20 నుంచి జూన్ 24 వరకు ట్రినిడార్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరుగనుంది. రెండు టెస్టు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతాయి.
టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత రెండు రోజుల విరామం అనంతరం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. ఇవి రాబోవు వన్డే వరల్డ్ కప్‌కి సన్నాహాక మ్యాచ్‌లుగా ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జూలై 27న తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. రెండో వన్డే జూలై 29న జరుగనుంది. తొలి వన్డే జరిగిన మైదానంలో రెండో వన్డే జరుగుతుంది. వన్డే సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఆగస్టు 1న ట్రినిడార్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరుగుతుంది. వన్డేలు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుండగా, ఐదు టీ20 మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…