IND Vs AUS : ప్రస్తుతం ఇండియా ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అందరు క్యూ కడుతుండగా, ఆ సమయంలో అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లీ(84 బంతుల్లో 4 ఫోర్లతో 44) అంపైర్ తప్పుడు నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ వికెట్ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రితో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇది అన్యాయమైన నిర్ణయమని రియాక్షన్ ఇచ్చారు. కోహ్లీ సైతం అంపైర్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ క్రీజును వీడాడు. డగౌట్‌లో రిప్లే చూసి మరింత షాక్ అయ్యాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు సందర్భంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నితిన్ మీనన్ అనేక తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. అవన్నీకూడా ఎల్బీడబ్ల్యూ అప్పీళ్లకు సంబంధించినవి. భారత ఇన్నింగ్స్ 50వ ఓవర్లో విరాట్ కోహ్లి వికెట్ పడటం అత్యంత వివాదానికి దారితీసింది.రోహిత్ శర్మ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు.. ఐదో వికెట్‌కు 59 పరుగులు జోడించిన అనంతరం జడేజా(26) ఔటైనా.. కోహ్లీ సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియ యువ స్పిన్నర్ మాథ్యూ కున్నేమన్ ఎల్బీగా ఔట్ చేశాడు.
అయితే అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి.. బ్యాట్, ప్యాడ్‌ను ఒకేసారి తాకినట్లు కనిపించింది. కాని థర్డ్ అంపైర్ మాత్రం… బంతి బ్యాటన్‌ను ముందుగా తాకినట్లు ఆధారాలు లేవని, ఫీల్డ్ అంపైర్‌కు కట్టుబడి నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దాంతో విరాట్ నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఫీల్డ్ అంపైర్ నితీన్ మీనన్‌పై అభిమానులు మండిపడుతున్నారు. కోహ్లీ విషయంలో మీనన్ తప్పు చేయడం ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా ఇలానే చేశాడని ట్రోలింగ్‌కు దిగుతున్నారు. టెక్నాలజీ ఇంత ఉన్నా.. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఏంటని నెటిజన్స్ మండిపడుతున్నారు.
https://twitter.com/minibus2022/status/1626855113892700160