ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో పొటీ మాములుగా ఉండదు. ఒకప్పుడు సంక్రాంతికి తమ సినిమాలతో పోటీపడిన మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ .. చాలా సంవత్సరాల తరవాత మళ్లీ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా ఈనెల 12న విడుదలవుతుండగా, ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు అంచనాలను మరింత పెంచాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు యుద్ధం మొదలుపెట్టారు. మరి రెండింటిలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందన్నది విడుదల తరవాత కానీ చెప్పలేం. కానీ, విడుదలకు ముందు అయితే మాత్రం ‘వీరసింహారెడ్డి’పై ‘వాల్తేరు వీరయ్య’ సినిమాదే పైచేయిలా కనిపిస్తోంది. ఎందుకంటే, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన థియేట్రికల్ బిజినెస్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమానే ముందంజలో ఉంది.రవితేజ కూడా ఇందులో నటించడంతో బయ్యర్లు అత్యధిక ధరలకు వాల్తేరు వీరయ్య చిత్రాన్ని కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని సొంతగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారని సమాచారం.
వాల్తేరు వీరయ్య బిజినెస్ ఏరియా వైజ్ లెక్క కట్టగా, నైజాం రూ. 18 కోట్లుగా, ఉత్తరాంధ్ర రూ. 10.2 కోట్లుగా ట్రేడ్ వర్గాలు ప్రకటించారు. ఏపీ/తెలంగాణా కలిపి రూ. 72 కోట్ల బిజినెస్ చేసినట్లు రిపోర్ట్ చేస్తున్నారు. కర్ణాటక రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 2 కోట్లు ఇక ఓవర్సీస్ రూ. 9 కోట్ల బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ రూ. 88 కోట్లుగా తేల్చారు. బ్రేక్ ఈవెన్ రూ. 89 కోట్లు. అంతకు పైన వస్తే మూవీ లాభాల్లోకి వెళ్ళినట్టేనని చెబుతున్నారు. ప్రాంతాల వారీగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. నైజాం: 18 కోట్లు, సీడెడ్: 15 కోట్లు, ఉత్తరాంధ్ర: 10.2 కోట్లు, తూర్పు: 6.50 కోట్లు, పశ్చిమ: 6 కోట్లు, గుంటూరు: 7.50 కోట్లు, కృష్ణ: 5.6 కోట్లు, నెల్లూరు: 3.2 కోట్లు, AP-TG మొత్తం:- 72.00 కోట్లు, కర్ణాటక: 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియా: 2.00 కోట్లు, ఓవర్సీస్ – 9 కోట్లు మొత్తం వరల్డ్ వైడ్: 88 కోట్లుగా తెలుస్తుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…