Mohan Babu : తెలుగు సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ నటులలో మోహన్ బాబు ఒకరు. హీరోగా, విలన్‌గా వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు. కొన్నాళ్లుగా మోహన్ బాబు సినిమాలకి దూరంగా ఉంటున్నారు. మా ఎలక్షన్స్ సమయంలో ఆయన చేసిన సందడి అంతా ఇంతాకాదు. ఇక మోహన్ బాబు తాజాగా తిరుపతి సమీపంలో ఉన్న శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీ కార్యక్రమంలో కనిపించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాంపస్ మొత్తాన్ని పరిశీలించిన వెంకయ్యనాయుడు అక్కడి సౌకర్యాలను, అతిపెద్ద వంటగదిని, పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న గ్రంథాలయాన్ని సందర్శించారు.
క్యాంపస్ లో పచ్చదనంతో పాటు, సౌకర్యాలకు పెద్దపీట వేసిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ పచ్చదనాన్ని కాపాడుకుంటున్న కళాశాల నిర్వహణ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. దేశభక్తి అంటే దేశాన్ని గౌరవించటం మాత్రమే కాదన్న వెంకయ్యనాయుడు, దేశమంటే మట్టికాదోయ్ – దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలను గుర్తు చేశారు. ముఖ్యంగా ఈతరం యువత భాష సంస్కృతులకు దూరమౌతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, పెద్దలను గౌరవించటం, మన సంస్కృతిని అలవరుచుకోవటం, భాషను కాపాడుకోవటం జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు.
అయితే క్యాంపస్‌కి కారులో వచ్చిన మోహన్ బాబు కారు దిగే సమయంలో చాలా ఇబ్బందిగా కనిపించారు. కారు దిగడానికి చాలా ఇబ్బంది పడ్డారు. మోహన్ బాబుని అలా చూసి ప్రతి ఒక్కరు షాకయ్యారు. మోహన్ బాబు ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారా అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాలలోను, రాజకీయాలలోను తనదైన ముద్ర వేసిన మోహన్ బాబు అనారోగ్యంతో బాదపడుతున్నారని కొందరు చెబుతుండగా, మరి కొందరు అలాంటిదేమి లేదని కొట్టి పారేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…