Harish Rao : ఏపీ మాజీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలోని రాజకీయాలపై జాతీయ స్థాయి నేతలు స్పందిస్తున్నారు. ఇక చంద్రబాబు అరెస్టు గురించి, చంద్రబాబు అరెస్టు తర్వాత జరుగుతున్న ఆందోళనల గురించి మంత్రి కేటీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలంగాణలో ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. అయితే తాజాగా మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శనివారం సిద్దిపేట జిల్లాలో నర్మెట్ట గ్రామంలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని నిర్మించడానికి భూమి పూజ చేసిన మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి ఉండకూడదని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఐటీ, ఐటీ అనేవాడు అని, ఇప్పుడు మాత్రం చంద్రబాబు… సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందిందని అంగీకరించారు. తన అరెస్ట్ కు ముందు చంద్రబాబు, తెలంగాణ అభివృద్ధి పైన చేసిన వ్యాఖ్యలను తాను ఈ సందర్బంగా గుర్తుచేశారు. తెలంగాణలో ఒక్క ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వంద ఎకరాలు వస్తాయని చంద్రబాబు అన్నారన్నారు. అదేవిధంగా తెలంగాణ రాక ముందు, ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఎకరం అమ్మితే, తెలంగాణ లో పది ఎకరాల భూమి వచ్చేదని గతంలో అన్నారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే తెలంగాణ అభివృద్ధి చెందినట్టే కదా అని అన్నారు. తెలంగాణలో రైతులకు కేసీఆర్ మంచి చేశారని చంద్రబాబు అంగీరించారన్నారు.
చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పాపం ఈ వయసులో ఆయనను అరెస్టు చేయడం మంచిది కాదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, బీడుపట్టిన భూములు, నెర్రబారిన పొలాలు కాంగ్రెస్ హయాంలో ఉండేవని మంత్రి హరీశ్ రావు అన్నారు.కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఆయన మంచితనం వల్లనే ఎప్పుడు రాష్ట్రంలో కరువు రాలేదని, అందుకే తెలంగాణ కరువులేని రాష్ట్రం అయ్యిందన్నారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రాష్ట్రంలో తీవ్ర కరువు వచ్చిందని అన్నారు.