UP CM Yogi Adithyanath : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‍ ద‌గ్గ‌ర ప్ర‌త్య‌క్ష‌మైన హ‌నుమాన్ టీం.. ఎందుకంటే..?

UP CM Yogi Adithyanath : టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో వ‌చ్చిన తాజా చిత్రం ‘హనుమాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా న‌టించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మూవీ మంచి టాక్ సంపాదించుకొని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.200 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. హ‌నుమాన్ చిత్రం మంచి విజ‌యం సాధించిన త‌ర్వాత చిత్రం బృందం ప‌లువురు ప్ర‌ముఖుల‌ని కుల‌స్తుండ‌డం విశేషంగా చెప్పుకోవాలి. రీసెంట్‌గా హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో లక్నోలోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు.

హనుమాన్ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ యోగికి వివరించారు. హనుమాన్ సినిమా విజయం సాధించండపై యోగి ఆదిత్యనాథ్ మూవీ టీం అభినందించినట్లు తెలిసింది. భేటీలో హనుమాన్ సినిమా చిన్నారులు, యువతపై ఎంత ప్రభావం చూపించిందో సీఎం యోగికి ప్రశాంత్ వర్మ వివరించారు. అలానే మన భారత ఇతిహాసాల్లోని అంశాలను సూపర్ హీరో స్టోరీలో ఏ విధంగా చూపించామనేది ఆయనకి వివరించారు. భేటీ పూర్తయిన తర్వాత ఏం మాట్లాడుకున్నారనేది ప్రశాంత్ వర్మ మీడియాకి చెప్పారు. యోగిజీని కలవడం నిజంగా ఒక గౌరవంగా భావిస్తున్నాను. ‘హనుమాన్’ సినిమాను ఆయన ఎంతగానో ప్రశంసించారు.

hanuman movie team met UP CM Yogi Adithyanath
UP CM Yogi Adithyanath

అలానే ఇలాంటి ఒక ఆఫ్‌బీట్ స్టోరీని సూపర్ హీరో కథనంగా తీర్చిదిద్దిన విధానాన్న ఆయన మెచ్చుకున్నారు. సినిమాలు మన సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా కాపాడతాయో యోగి వివరించారు. అలానే సినిమాల ద్వారా మన చరిత్రను చూపించడం అవసరమని.. ఇలాంటి చిత్రాలు మరిన్ని తీయాలంటూ మమ్మల్ని ప్రోత్సహించారు.” అంటూ ప్రశాంత్ వర్మ చెప్పారు. ఆధ్యాత్మికతను ఇలా అర్థం చేసుకొనే ముఖ్యమంత్రి ఉండటం గ్రేట్ అని చెప్పారు. ఇటువంటి ప్రోత్సాహాలు మేం మరిన్ని కొత్త ప్రయోగాలు చేయడానికి మనకు స్ఫూర్తిని ఇస్తుందని పేర్కొన్నారు. యోగి జీని కలవడం నిజంగా తమకు ఒక గౌరవంగా ఉందని చిత్ర యూనిట్ చెప్పింది.ఈ మూవీ ప్రతి టికెట్ పై రూ. 5 చొప్పున మొత్తం రూ.2.66 కోట్లను అయెధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చిన విష‌యం తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago