Hansika : సౌత్ నటి హన్సిక మోత్వానీ తెలుగు, తమిళ భాషలలో తన హవా చూపించిన విషయం తెలిసిందే. బాల నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. అటుపై దక్షణాదిలో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ నటిగా ఓ వెలుగు వెలిగింది. దేశముదురు సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత కన్నడలో కూడా పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. అయితే తెలుగులోనే ఈ అమ్మడిక పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. హన్సిక అందాలకు కోట్లాది మంది అభిమానులు ఫిదా అయ్యారు. ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ‘దేశముదురు’ సినిమా తరువాత హన్సికకు వరుస ఆఫర్లు వెల్లువెత్తిన కూడా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది.
తెలుగులో అల్లు అర్జున్ , ఎన్టీఆర్ వంటి ఆగ్ర హీరోలతో మాత్రమే ఆఫర్లు దక్కాయి. అల్లు అర్జున్‌తో ‘దేశముదురు’ తరువాత ,ఎన్టీఆర్‌తో ‘కంత్రి’లో మాత్రమే కనిపించింది. తెలుగులో కంటే కూడా ఎక్కువుగా ఈ అమ్మడు తమిళంలోనే సక్సెస్ సాధించింది. తమిళ టాప్ హీరోల సరసన నటించే అవకాశం హన్సికకు దక్కగా, ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో అక్కడి అభిమానులు హన్సికకు గుడి కూడా కట్టారు. కొన్నాళ్లు శింబుతో ప్రేమాయణం నడిపిన హన్సిక కొంత కాలానికి బ్రేకప్ చెప్పేసింది ఈ చబ్బీ బ్యూటీ. ఇదే సమయంలో సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో..గతేడాదే పెళ్లి పీటలెక్కిసింది. సొహైల్ అనే వ్యక్తిని హన్సిక ప్రేమించి పెళ్లి చేసుకుంది.
తన సినీ కెరీర్ ప్రారంభంలో ఓ తెలుగు హీరో తనను చాలా ఇబ్బందులకు గురిచేశాడనేది హన్సిక చెప్పుకొచ్చింది. అయితే ఆ స్టార్ హీరో పేరు మాత్రం బయటపెట్టలేదు. హన్సికను కాస్టింగ్ కౌచ్‌కు గురి చేసిన ఆ స్టార్ హీరో ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది. కెరీర్ స్టార్టింగ్‌లో టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు హన్సికను డేట్‌కు వెళ్దామంటూ తరచూ వేధించినట్లుగా ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ న్యూస్ వైరల్ కాగా.. హన్సిక స్పందించింది. బేస్‌లెస్ వార్తలు ప్రచురించే ముందు క్రాస్ చెక్ చేయాలని పబ్లికేషన్స్‌ను కోరుతున్నా. గుడ్డిగా ప్రచురించే ముందు వాస్తవాన్ని తెలుసుకోండి. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వ్యాఖ్యను నేను ఎప్పుడూ చేయలేదు అని క్లారిటీ ఇచ్చింది.