Teja: టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో తేజ ఒకరు. ఆయన తెరకెక్కించిన అహింసా చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నాడు తేజ.మీ సినిమాలన్నీ ఒకే టైపు ఉంటాయని యాంకర్ ప్రశ్నించగా, దానికి స్పందిస్తూ.. నేను నాలా తీస్తాను కాబట్టి ఒకేలా ఉంటాయని, అన్ని సినిమాలకు నేనే డైరెక్టర్ ని కాబట్టి కచ్చితంగా సిమిలారిటీస్ ఉంటాయని, కొన్ని సన్నీ వేశాలు కలుస్తుంటాయని,దగ్గరగా అనిపిస్తుంటాయని చెప్పుకొచ్చారు. సినిమాని రాసింది, ఇప్పుడు తీసింది నేనే అయినప్పడు వాటికి దగ్గరిపోలికలుంటాయని వెల్లడించారు తేజ.
నేను మాత్రమే కాదు, ఏ డైరెక్టర్ సినిమాలైనా ఒకేలా ఉంటాయని, అలాగే రాజమౌళి సినిమాలన్నీ కూడా ఒకేలా ఉంటాయని చెప్పుకొచ్చారు.. ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే సినిమాలన్నీ ఒకే ప్యాట్రన్‌లో ఉంటాయని తెలిపారు. వరుస బెట్టి ఒకదాని తర్వాత ఒకటి చూస్తే ఒకేలా అనిపిస్తాయని, పెద్దగా తేడా కనిపించదని తెలిపారు. రాజమౌళి మాత్రమే కాదు, మహేంద్రన్, గౌతమ్ మీనన్ సినిమాలు కూడా అలానే ఉంటాయని అన్నారు దర్శకుడు తేజ. రాజమౌళి గొప్పదనం గురించి ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే తేజ మాత్రం ఇండియన్ రుపీ వెల్యూ రాజమౌళి వల్ల పెరగనుందని అన్నాడు. అమెరికన్ సినిమాలు చూసి ఆ దేశానికి డాలర్ రేటు పెరిగిందని , అలాగే రాజమౌళి హై స్టాండర్డ్స్ తో తీసే తెలుగు సినిమాల వల్ల త్వరలోనే ఇండియన్ రుపీ వెల్యూ కూడా పెరుగుతుందని జోస్యం చెప్పాడు.
ఇక ఇంటలిజెంట్స్ డైరెక్టర్స్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ అనే విషయం గురించి చెబుతూ, ఇంటిలిజెంట్ డైరెక్టర్స్ లో తేజ, సుకుమార్, రాజమౌళి, బోయపాటి, వినాయక్ వంటి పేర్లని యాంకర్ చెప్పగా, వాళ్లంతా ఇంటలిజెంట్ డైరెక్టర్సా అని ఎదురు ప్రశ్నించాడు. వాళ్లు సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ మాత్రమే అని, ఇంటిలిజెంట్ డైరెక్టర్స్ కాదని అన్నాడు. అందులో తనని కూడా కలుపుకుని, తాను ఇంటిలిజెంట్ డైరెక్టర్ ని అయితే అన్నీ హిట్లే ఇవ్వాలి కదా, ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయని, ఒకవేళ తాను వేస్ట్ డైరెక్టర్‌ని అయితే అన్నీ ఫ్లాప్‌లే తీయాలి కదా, సక్సెస్‌లు ఎలా వచ్చాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తేజ