Hansika : యాపిల్ భామ హన్సిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దేశముదురు సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన ఈ మిల్కీ అందం ఆ తర్వాత ఎడా పెడా సినిమాలు చేయడంతో ఆమె సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.తాజాగా పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం కొత్త కొత్త అందాలతో ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. హన్సిక తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమల్లోనూ నటించి మెప్పించింది. గత ఏడాది డిసెంబరు 4న తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్ కతురియాను పెళ్లి చేసుకుంది.
కొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. జైపూర్ సమీపంలోని ముందోటా ఫోర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఈ పెళ్లికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట ఎంత హల్‌చల్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక హన్సిక తాజాగా తన తల్లితో కలిసి ఓ షోలో పాల్గొంది. ఈ టాక్ షోలో హన్సిక తనపై జరుగుతున్న సంచలన రూమర్ గురించి నోరు విప్పింది. హన్సిక అందాలు పెంచుకునేందుకు హార్మోనల్ ఇంజక్షన్ తీసుకుందని గతంలో పుకార్లు రాగా, దానిపై స్పందించిన హన్సిక.. నాకు 21 ఏళ్ల వయసున్నప్పుడు చాలా మంది చెత్త వాగుడు వాగారు. నేను 8 ఏళ్లకే నటిని అయ్యాను.
త్వరగా ఎదిగేందుకు మా అమ్మ నాకు ఇంజక్షన్ ఇచ్చినట్లు చాలా అసభ్యంగా ప్రచారం చేశారు. అసలు ఇలాంటివి నిజం అని ఎలా నమ్ముతారు అంటూ హన్సిక అసహనం వ్యక్తం చేసింది. నేను నిజంగా హన్సికకి ఇంజక్షన్స్ ఇచ్చి పెంచి ఉంటే టాటా బిర్లా కంటే ధనవంతురాలిని అయ్యే దానిని కదా, ప్రతి ఒక్కరు వారివి త్వరగా పెరిగేందుకు నా దగ్గరికే వచ్చేవారు కదా.. ఇలా అసత్యమైన ప్రచారాలు చేసేందుకు కనీసం కామన్ సెన్స్ ఉండాలి అంటూ హన్సిక తల్లి ఆగ్రహం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.