Godfather OTT : ఆచార్య చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించి మెప్పించిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా మంచి విజయం సాధించిన కూడా కలెక్షన్స్ మాత్రం నామమాత్రంగానే రాబట్టింది. మలయాళీ మూవీ ‘’లూసీఫర్’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు.. సునీల్, షఫీ, అనసూయ, పూరి జగన్నాధ్ తదితరులు ఇతర పాత్రల్లో సందడి చేశారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. అయితే థియేటర్లలో దుమ్ములేపిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది..
గాడ్ ఫాదర్’ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి నుంచి (నవంబరు 19) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి రాగా, ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత ఆర్.బీ చౌదరి నిర్మించారు. ఇప్పటికే దసరా రోజు రిలీజైన నాగార్జున ది ఘోస్ట్, రీసెంట్ గా కార్తీ నటించిన సర్దార్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పుడు గాడ్ ఫాదర్ కూడా ఓటీటీలో తన హవా చూపించేందుకు సిద్ధమైంది. మరి ఓటీటీలో ఏ సినిమాకి ఎక్కువ ఆదరణ లభిస్తుందో చూడాలి.
ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్నాయి. ఇక ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా..మాస్ మాహారాజా రవితేజ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత, ‘సైరా’, ‘ఆచార్య’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో చిరు తీవ్రంగా నిరాశపడ్డారు.. వాటితో పోలిస్తే ‘గాడ్‌ఫాదర్’ కొంత రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు ఆ ఉత్సాహంతో మిగతా సినిమాలు చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…