GodFather 2022 Movie Review : గాడ్ ఫాద‌ర్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

GodFather 2022 Movie Review : ఆచార్య ఫెయిల్యూర్ అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి మ‌రోమారు గాడ్ ఫాద‌ర్ మూవీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీపై మొద‌టి నుంచీ అభిమానుల్లో ఎన్నో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ముఖ్యంగా గాడ్‌ఫాద‌ర్ ట్రైల‌ర్ అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. దీంతో ఈ మూవీ ద్వారా హిట్ ప‌డిన‌ట్లే అని భావించారు. అలాగే బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ కూడా న‌టించ‌డంతో అంచ‌నాలు ఒక రేంజ్‌కి వెళ్లిపోయాయి. ఈ క్ర‌మంలోనే అక్టోబ‌ర్ 5, శుక్ర‌వారం గాడ్ ఫాద‌ర్ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. అంద‌రి అంచ‌నాల‌ను అందుకుందా.. లేదా.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గాడ్ ఫాద‌ర్ మూవీ క‌థ‌..

సీఎం పీకేఆర్ మ‌ర‌ణంతో సినిమా మొద‌ల‌వుతుంది. ఆయ‌న మ‌ర‌ణం అనంత‌రం రాష్ట్రానికి ఎవ‌రు సీఎం అని అంద‌రూ చ‌ర్చించుకుంటారు. ఆయ‌న పార్టీలో ఉన్న ప్ర‌ముఖ నేత‌లు నేనే సీఎం కావాలి అంటే.. నేనే కావాలి.. అని వ్యూహాలు ప‌న్నుతుంటారు. ఈ క్ర‌మంలోనే బ్ర‌హ్మ (చిరంజీవి) ఎంట‌ర్ అవుతాడు. దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు మారిపోతాయి. ఈ క్ర‌మంలోనే స‌త్య‌ప్రియ (న‌య‌న‌తార‌), జ‌య‌దేవ్ (స‌త్య‌దేవ్‌)లు బ్ర‌హ్మ జీవితంలో ఎంట‌ర్ అవుతారు. అయితే జ‌య‌దేవ్‌ గురించి బ్ర‌హ్మ‌ ఓ క‌ఠోర నిజాన్ని తెలుసుకుంటారు. దీంతో క‌థ మొత్తం మారిపోతుంది. చివ‌ర‌కు బ్ర‌హ్మ ఏం చేస్తారు.. జ‌య‌దేవ్‌కు చెక్ పెడ‌తారా.. సీఎం ఎవ‌రు అవుతారు.. క‌థ ఏమ‌వుతుంది.. పీకేఆర్‌కు, బ్ర‌హ్మ‌కు సంబంధం ఏమిటి.. అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

GodFather 2022 Movie Review
GodFather 2022 Movie Review

విశ్లేష‌ణ‌..

గాడ్‌ఫాద‌ర్‌గా మెగాస్టార్ చిరంజీవి సూప‌ర్బ్‌గా యాక్ట్ చేశార‌నే చెప్పాలి. ఆయ‌న‌కు తోడు స‌ల్మాన్ ఖాన్‌, న‌య‌న‌తార‌, స‌ముద్ర‌ఖ‌ని, స‌త్య‌దేవ్ లాంటి వారు త‌మ పాత్ర‌ల‌కు 100 శాతం న్యాయం చేశారు. ఇది రీమేక్ సినిమా కావ‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేలా తెర‌కెక్కించారు. అందువ‌ల్ల చిరంజీవి ప‌లికే డైలాగ్స్ ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయాల‌ను ప్ర‌తిబింబిస్తాయి. ఇక సినిమాలో సీన్ సీన్‌కు ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే ఉత్కంఠ క‌లుగుతుంది. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా త‌న ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు.

అలాగే సినిమా మ్యూజిక్‌, సినిమాటోగ్ర‌ఫీ బాగున్నాయి. చిరంజీవితోపాటు స‌ల్మాన్ ఖాన్ యాక్ష‌న్ సీన్ల‌ను కూడా ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు. ఓవ‌రాల్‌గా చెప్పాలంటే.. ఈ మూవీ చిరు అభిమానుల‌కు పండుగ వినోదాన్ని అందిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ వారం గ‌డిస్తే కానీ.. సినిమా హిట్టా.. ఫ్లాపా.. అన్న విష‌యం తెలియ‌దు. క‌నుక మూడు రోజుల వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు. ఇక కొత్త‌ద‌నం కోరుకునే వారు క‌చ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.

Share
editor

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 weeks ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 weeks ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago