Sangeetha Krish : తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ సంగీత. నిజానికి ఈమె తమిళమ్మాయే అయినప్పటికీ తెలుగు సినిమాలతోనే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకొని తెలుగు ప్రజల మనసులు గెలుచుకుంది. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషల్లో సినిమాలు చేసిన సంగీత 65కి పైగా సినిమాల్లో నటించిందన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ఖడ్గం చిత్రం ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు షోలకు జడ్జిగా పాల్గొంటోంది. ఇటీవల ఓ షోలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. చిన్నతనం నుంచి చాలా లావుగా ఉండేదాన్ని నాకు కొన్ని చర్మ సమస్యలు కూడా ఉండేది. ముఖ్యంగా బంగారు నగలను ధరిస్తే అలర్జీ వచ్చేసేది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్‌గా పనికి రానని చాలా మంది అవమానించారు. దాంతో హీరోయిన్ గా చేయనని మా అమ్మతో చెప్పేసి సినిమాలు మానేద్దామనుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.
సంగీత క్రిష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2009 లో సింగర్ క్రిష్ ను వివాహం చేసుకోగా, క్రిష్ తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను పాడారు. సింగర్ గా తమిళ చిత్ర పరిశ్రమలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ధనుష్ సాంగ్స్ లో సూపర్ హిట్ సాంగ్ రౌడీ బేబీ పాటను క్రిష్ పాడారు. వీరిద్దరికీ షివియా అనే పాప కూడా ఉంది. మహేశ్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్వరాజ్యం అనే పాత్రలో నటించి తన నటనతో ఆకట్టుకుంది. ఆచార్య, ఎఫ్3 సినిమాల్లో కూడా నటించి అలరించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…