Geetha Krishna : గీతా కృష్ణ.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేదు. సంకీర్తన, కోకిల, కీచురాళ్లు.. వంటి సినిమాలతో డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్న గీతా కృష్ణ…సినిమాల కంటే యాడ్ షూటింగ్స్‌తోనే బిజీగా ఉంటారు.ఏ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడంలోనూ ఆయన స్టైలే వేరు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేస్తున్నారు. నేను ఆయన గురించి మాట్లాడుతున్నానంటే నాకు ఆయనేంటో తెలుసు. నేను మంచి చెప్పినా, చెడు చెప్పినా అతని మంచి కోసమే చెప్పాను. సినిమా వ్యక్తిగా పవన్ కళ్యాణ్‌ను ఇష్టపడతాను అని అన్నాడు.
ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. మహేష్ బాబు విగ్ స్టారే.. ఆయనకు విగ్ తప్ప పెద్ద అందం ఏమి లేదు.ఇండస్ట్రీలోని హీరోలందరు దాదాపు విగ్ స్టార్లే అని చెప్పిన ఆయన ప్రభాస్ విగ్ వాడడు అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ చాలా ఎత్తు పెరిగాడు కాని బుర్ర లేదు. ఆ బుర్రలేకపోవడంతోనే ఎలాంటి సబ్జెక్ట్ చేయాలో తెలియడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇలా పలువురు హీరోల గురించి గీతా కృష్ణ చేసిన సంచలన కామెంట్స్ ఫిలిం నగర్‌లో చర్చనీయాంశంగా మారాయి.
![Geetha Krishna : మహేష్‌కి విగ్గు తప్ప ఏం లేదు, ప్రభాస్‌కి బుర్రలేదంటూ గీతా కృష్ణ సంచలన వ్యాఖ్యలు.. Geetha Krishna sensational comments on mahesh babu and prabhas](http://3.0.182.119/wp-content/uploads/2022/11/geetha-krishna.jpg)
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఆయన చివరిగా సర్కారు వారి పాట చిత్రంతో పలకరించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. త్వరలో త్రివిక్రమ్ సినిమాతో పలకరించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత రాజమౌళితో భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నాడు. ఇటీవల మహేష్ ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో సినిమా షూటింగ్‌కి కింత బ్రేక్ ఇచ్చాడు మహేష్. ఇక ప్రభాస్ రీసెంట్‌గా రాధేశ్యామ్‌తో పలకరించగా ఇప్పుడు సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె వంటి చిత్రాలు చేస్తున్నాడు.