Flax Seeds Laddu : మనలో చాలా మందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. వాటిల్లో కాల్షియం తక్కువగా ఉండడం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నరాల్లో తిమ్మిర్లు, రాత్రి పూట పిక్కలు పట్టుకుపోవడం, నీరసం, అలసట, బద్దకం, అజీర్ణం, బీపీ వంటి అనేక సమస్యలు ఉంటాయి. అయితే వీటికి వివిధ రకాల మందులను వాడుతుంటారు. కానీ వీటన్నింటినీ తగ్గించేలా ఒకే ఒక్క ఔషధాన్ని వాడవచ్చు. అయితే వాస్తవానికి అది ఆయుర్వేద ఔషధం కాదు. తినే పదార్థం. అవును.. అయినా అది ఔషధంలా పనిచేస్తుంది. ఇంతకీ అసలు ఆ పదార్థం ఏమిటంటే..
అదే అవిసె గింజల లడ్డూ. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. మనం ఈ లడ్డూను తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు.. అవిసె గింజలు 200 గ్రాములు, నువ్వులు 200 గ్రాములు. మీరు కావాలనుకుంటే నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు ఏవైనా సరే తీసుకోవచ్చు. అలాగే బెల్లం 300 గ్రాములు, గోధుమపిండి ఒక చిన్న కప్పు, నెయ్యి 100 గ్రాములు, బాదం పప్పులు 50 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, కిస్మిస్‌లు 50 గ్రాములు, అలాగే 30 గ్రాముల గోంద్ తీసుకోవాలి. ఇది పిల్లలకు. పిల్లల తల్లులకు కీళ్ల నొప్పులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకు ఎక్కడైనా ఆయుర్వేద షాప్ లో కానీ పచారీ కొట్టులో కానీ లభిస్తుంది.
ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఈ లడ్డూ మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ లడ్డూను రోజుకి ఒకటి నుండి రెండు వరకు తినవచ్చు. ఇప్పుడు లడ్డూ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఇందుకోసం మనం ముందుగా నువ్వులను తీసుకొని వాటిని వేయించుకోవాలి. నువ్వులు మంచి రంగులోకి వచ్చిన తర్వాత వాటిని వేరే బౌల్ లోకి తీసుకోవాలి. అవిసె గింజలను వేసి అలాగే వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నెయ్యి వేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత గోంద్ కూడా వేసి వేయించుకోవాలి. అలాగే మిగిలిన నెయ్యిలో గోధుమపిండి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిని ఏదైనా ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను రవ్వ లాగా పొడి లాగా మిక్సీ చేసుకోవాలి.
ఇప్పుడు మనం గోధుమపిండి వేయించి పెట్టుకున్న గిన్నెలోకి మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. అలాగే నువ్వులు, అవిసె గింజలను కూడా పొడి లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీన్ని కూడా గోధుమపిండి మిశ్రమంలో కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకోవాలి. దీనికోసం మనం అలాగే బెల్లాన్ని తీసుకొని పాకం లాగా తయారు చేసుకోవాలి. తర్వాత దీన్ని వడకట్టుకోండి. తర్వాత ఈ పాకాన్ని ఒక పాన్ లో తీసుకుని స్టవ్ పై పెట్టుకొని మరిగించాలి. ఇప్పుడు మనకు పాకం రెడీ అవుతుంది.
ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని కూడా అన్ని పదార్థాలు వేసిన బౌల్‌లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మనకు నచ్చిన సైజులో లడ్డూలను తయారు చేసుకోవాలి. నువ్వులు, అవిసె గింజలలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది అందుకే లడ్డూలను చేయడానికి మనకి ఎక్కువ నెయ్యి అవసరం లేదు. ఈ లడ్డూలని ఎవరికైతే కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయో వాళ్లకి ఇవ్వండి. అలాగే శరీరంలో రక్తం తక్కువగా ఉన్నా, మీకు రోజంతా బద్ధకంగా అనిపిస్తున్నా, ఏ పని చేయాలి అన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా అప్పుడు కూడా ఈ లడ్డూను తినండి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…