Ex CM KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బాత్రూంలో కాలు జారి పడటంతో తొంటి ఎముక విరగడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆసుపత్రి వైద్యులు హిప్ బోన్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌కు స్టీల్ ప్లేట్‌ని అమర్చారు. సర్జరీ చేసిన కొన్ని గంటలకే ఆయనతో వాకర్ సహాయంతో నడిపించడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో లో కేసీఆర్ కాస్త నీరసంగా, కదల్లేని పరిస్థితిలో ఉండటం చూసి నెటిజన్లు, బీఆర్ఎస్ శ్రేణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.
అయితే డాక్టర్ కేసీఆర్‌ని అటు ఇటు తిప్పుతూ హడావిడి చేస్తుండగా, ఏంది ఇప్పుడే ఉరకమంటావా అన్నట్టు ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోయారు. అక్కడే రెండ్రోజులు గడిపిన తర్వాత ఆయన బాత్రూంలో కాలు జారి పడ్డారు. ఫామ్‌హౌస్‌లో పడిపోవడంతో కేసీఆర్ తొంటి ఎముక విరిగింది. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోధ ఆసుపత్రిలో సర్జరీ చేశారు. కేసీఆర్‌కు హిప్ బోన్ రీప్లేస్‌మెంట్ చేశారు. అయితే శస్త్ర చికిత్స చేసిన కొన్ని గంటలకు కేసీఆర్‌తో నడక ప్రాక్టీస్ చేయించారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఇక కేసీఆర్ ని రేవంత్ కూడా పరామర్శించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పలకరింపు ఇలా ఉంటుందని ఎవరూ అనుకోలేదు. గతంలో వారు ముఖాముఖి కలిశారో కలవలేదో ఎవరికీ అనవసరం.. కానీ రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిద్దరు తొలి సారి ఇలా ఆస్పత్రిలో పలకరించుకోవడం, అది కూడా పరామర్శ పర్వం కావడం మాత్రం నిజంగా విచిత్రమే. నిన్న మొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థిగా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ వద్దకు నేరుగా వెళ్లి పలకరించారు. చేతులో జోడించి నమస్కారం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి. పక్కన మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…