EMotorad T Rex Plus Electric Cycle : ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటితోపాటు ఎలక్ట్రిక్ సైకిల్స్‌ను కూడా చాలా మంది కొంటున్నారు. ఫిట్‌నెస్ కోరుకునే చాలా మంది ఎలక్ట్రిక్ సైకిల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మన దేశంలో పలు దేశీయ కంపెనీలతోపాటు అంతర్జాతీయ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ సైకిల్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఇక ఇదే కోవలో ఈమోటోరాడ్ అనే కంపెనీ ఒక కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేసింది. దీన్ని టి-రెక్స్ ప్లస్‌గా మార్కెట్‌లో ఆవిష్కరించారు. ఇప్పటికే ఉన్న టి-రెక్స్ అనే సైకిల్‌కు అడ్వాన్స్‌డ్ వెర్షన్‌గా ఈ టి-రెక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను మార్కెట్‌లోకి తెచ్చారు.
టి-రెక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్‌కు గాను ఇప్పటికే అడ్వాన్స్‌డ్ బుకింగ్స్‌ను కూడా ప్రారంభించారు. లాంచింగ్ ఆఫర్ కింద రూ.2000 విలువైన యాక్ససరీస్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఆఫర్‌ను ఆగస్టు 15వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇక ఈ సైకిల్ ధర రూ.44,999గా ఉంది. ఇందులో స్టెమ్ ఇంటిగ్రేటెడ్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇలాంటి డిస్‌ప్లే కలిగిన తొలి ఎలక్ట్రిక్ సైకిల్ దేశంలో ఇదే కావడం విశేషం. అలాగే ఈ డిస్‌ప్లే బోర్డు సైకిల్ లుక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. దీంతోపాటు రైడర్‌కు ఎంతో విలువైన సమాచారాన్ని సైతం అందిస్తుంది. ఈ సైకిల్‌కు అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి లైఫ్ టైమ్ వారంటీని సైతం అందిస్తున్నారు.
ఈమోటోరాడ్ టి-రెక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ 250 వాట్ల మోటార్ సహాయంతో పనిచేస్తుంది. 36 వోల్టుల శక్తి అవసరం. 10.2 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 7 షిమానో అట్లాస్ గేర్, 7 స్పీడ్ డ్రైవ్ ట్రెయిన్, 5 పెడల్ అసిస్ట్ మోడ్స్, ఆటో కటాఫ్ డిస్క్ బ్రేకులు, ముందు వైపు లైట్, హారన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక ఈ సైకిల్‌లోని బ్యాటరీ పూర్తి చార్జింగ్‌కు సుమారుగా 4 గంటలు పడుతుంది. దీంతో 45 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అదే కాస్త వేగం పెంచితే 35 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇక ఈ సైకిల్‌ను త్వరలోనే మార్కెట్‌లో విక్రయిస్తారు. కానీ వినియోగదారులు ముందుగానే దీన్ని బుకింగ్ చేసుకోవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…