Indira Devi : సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి బుధవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతితో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇందిరా దేవి మరణం తర్వాత ఆమెకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవి తెలుసుకున్న మహేష్ అభిమానులు ఇందిరా దేవి గొప్ప మనస్సుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇందిరా దేవి కృష్ణకు స్వయానా మేనమామ కుమార్తె. వీరి స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని ముసళ్లమడుగు.
కుటుంబ సభ్యులు చెప్పడంతో కృష్ణ.. ఇందిరా దేవిని వివాహం చేసుకున్నాడు. ఆమె మీడియాకు చాలా దూరంగా ఉన్నారు. అనవసర విషయాలను ఆమె పట్టించుకుని హైలెట్ అయ్యే వారు కాదు. కృష్ణ.. విజయ నిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే ఆమె ఎప్పుడూ ఎక్కడా హడావుడి చేయలేదు. అయితే కృష్ణతో విడాకులు తీసుకోకుండానే ఆమె పిల్లల బాధ్యతలు చూసుకోవడం జరిగింది. 1969 లో కృష్ణ – విజయనిర్మల ఒక గుడిలో పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనం. కృష్ణకి మంచి హిట్స్ వస్తున్నసమయంలో ఆయన జయప్రద, విజయ నిర్మలతో ఎక్కువగా సినిమాలు చేశారు.
![Indira Devi : ఇందిర ఉండగా.. కృష్ణ.. విజయ నిర్మలని ఎందుకు పెళ్లి చేసుకున్నారు..? do you know why Krishna married Vijaya Nirmala even if he has Indira Devi](http://3.0.182.119/wp-content/uploads/2022/09/indira-devi-krishna.jpg)
ఆ కారణంగానే విజయ నిర్మల – కృష్ణ మధ్య అనుబంధం ఏర్పడింది. ఇక కృష్ణ పలు సినిమాలకు విజయ నిర్మల డైరెక్షన్ చేయడం, ఔట్ డోర్‌లో కృష్ణని కాస్త ఎక్కువ పట్టించుకోవడంతో ఆమె మీద ప్రేమ పెంచుకున్న ఆయన వివాహం చేసుకున్నారు. ఇందిరాకి ఒక్క మాట కూడా చెప్పకుండా కృష్ణ ఈ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఇందిరకు మనసులో బాధ ఉన్నా బయట పెట్టలేదనే అంటారు. ఇందిర.. విజయనిర్మలను బాగా చూసుకునేవారని.. తన భర్తను ఎంతో ఆప్యాయతతో చూసుకోవడం ఇందిరకు కూడా నచ్చేదని అంటారు. కృష్ణకు విజయ నిర్మల వెన్నెముక అని తెలుసుకున్న ఇందిరా దేవి ఒప్పుకున్నారు గానీ.. విజయ నిర్మలతో పిల్లలను కనడానికి మాత్రం నో చెప్పారు. ఆ కండిషన్ తోనే పెళ్లి చేసుకున్నారని టాక్.