Pathala Bhairavi : విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు టాలీవుడ్ లో సరికొత్త అధ్యాయం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. సినిమాలే కాదు రాజకీయాలలోనూ తన సత్తా చాటారు ఎన్టీఆర్. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావడమే కాకుండా.. రాజకీయ విధానాన్ని సమూలంగా మార్చేసిన మహానాయకుడు.. భూస్వాముల పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. సినిమాలు, రాజకీయాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు.
చాలా కష్టపడి ఈస్థాయికి చేరుకున్న ఎన్టీఆర్ కెరీర్ మొదట్లో ఎంతో పొదుపు చేస్తూ వచ్చారు. ఇక నిర్మాతలు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా ఎన్టీఆర్ డిమాండ్ చేసేవారు కాదట. నిర్మాతల పరిస్థితిని అర్ధం చేసుకొని ఆయన రెమ్యునరేషన్ తీసుకునే వారట. తాజాగా ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా పాతాళ భైరవి రెమ్యునరేషన్ వైరల్ అవుతోంది.
తెలుగు సినిమా చరిత్రలో ఆసక్తికరమైన అధ్యాయం పాతాళభైరవి. ఎన్టీఆర్.. ఎస్వీఆర్.. రేలంగి.. పద్మనాభం.. బాలకృష్ణ.. చిన్న పాత్రలో సావిత్రి.. వాళ్లందరినీ అలా చూస్తుంటే, తెలుగు ఇండస్ట్రీకి ఒక వరం మాదిరిగా ఉంటుంది. 1951 లో ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు. కర్ర సాము నేర్చుకున్నారు. అయతే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ రెమ్యునరేషన్‌గా స్టూడియోలోనే ఇడ్లీలు, వడ టిఫిన్ గా పెట్టేవారట. అంతే కాకుండా నెలకు రూ.250 రెమ్యునరేషన్ తీసుకునేవారట. ఈ విషయం తెలుసుకొని అందరూ అవాక్కవుతున్నారు.