Ponniyin Selvan 1 Movie Review : ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినన హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో ముఖ్యపాత్రలలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష నటించారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం అన్ని భాషలలో విడుదలైంది. అయితే ఇందులో కాస్త తమిళ ఫ్లేవర్ ఎక్కువగా కనిపించింది.
కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. బాహుబలి ఇచ్చిన సక్సెస్‌తో మణి రత్నం ఈ భారీ ప్రాజెక్ట్ చేపట్టగా ఈ చిత్ర కథ చోళ రాజ్యపు రాజుల గొప్పతనం గురించి నడుస్తుంది. చోళ రాజ్యంను దక్కించుకునేందుకు ప్రయత్నించే వారి నుండి రాజు ఆదిత్య కరికాలుడు (విక్రమ్) రక్షించేందుకు ఎలాంటి వ్యూహాలు పన్నుతాడనేది అసలు కథ.
చోళ రాజు ఆదిత్య కరికాలుడు పాత్రలో విక్రమ్ నటన అద్భుతం. ఇక త్రిష అందంతోపాటు అభినయంతో ఆకట్టుకుంది. నందినిగా ఐశ్వర్య చాలా విభిన్నంగా నటించింది. ఇక కార్తి తన పాత్ కు నూరు శాతం న్యాయం చేశాడు. జయం రవి నటన కూడా బాగుంది. ప్రకాష్ రాజ్ తోపాటు ఇతర నటీ నటులు అంతా కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. మణిరత్నం పాత్రకు తగ్గట్టు క్యారెక్టర్స్‌ని ఎంచుకోవడం బాగా కలిసొచ్చింది.
ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. దర్శకుడు మణిరత్నం ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాని తెరకెక్కించాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పాటలు తమిళ ఫ్లేవర్ ఉండటం వల్ల కాస్త ఇబ్బందిగా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలు కనిపిస్తాయి.
మొత్తంగా ఈ సినిమా బాహుబలి రేంజ్‌లోనే ఉన్నా తమిళ ఫ్లేవర్ ఎక్కువగా ఉండడం వలన కొంత నిరుత్సాహం కలుగుతుంది. డబ్బింగ్ లో క్వాలిటీ వల్ల తెలుగు సినిమా అన్నట్లుగా కొన్ని సార్లు ఫీల్ కలుగుతుంది. రెహమాన్ కూడా సినిమాకి ప్రాణం పెట్టి పని చేశాడు. దీంతో సినిమా ఓ లెవల్‌కి వెళ్లిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాకు చూసేందుకు కాస్త ఓపిక ఉండాలి. విభిన్నమైన చిత్రాన్ని కోరుకునేవారు ఈ మూవీని ఒకసారి చూడవచ్చు. లేదంటే లైట్ తీసుకోవడమే బెటర్.