Vikramarkudu Movie : దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. ఆయన తీసిన సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులతో పాటు.. సినీ నటులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. రాజమౌళి సినిమాలో ఏ చిన్న పాత్ర దొరికిన చాలు అనుకుంటారు. అలాంటిది మరి రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం వస్తే? ఎవరైనా ఎగిరి గంతేస్తారు. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా ఇదే కోరుకుంటారు. అయితే అలాంటి జక్కన్న ఒక్కప్పుడు సినిమా చేస్తామని వచ్చినా కొంతమంది స్టార్ హీరోలు మిస్ చేస్తున్నారు.
ఇక జక్కన్న కెరీర్ లో అతిపెద్ద హిట్స్ లో విక్రమార్కుడు సినిమా కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో రాజమౌళి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. మాస్ రాజా రవితేజ కెరీర్‌లో విక్రమార్కుడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాను ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేశారు. సినిమాలో రవితేజ హీరోయిజం మాములుగా ఉండదు. తండ్రీకూతుళ్ళ సెంటిమెంట్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. అయితే జకన్న ఈ సినిమా కథను మొదట పవన్ కళ్యాణ్ కు వినిపించాడట.

కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు వేరే సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండటంతో రిజెక్ట్ చేశారట. ఈ వార్త తెలిసిన పవన్ ఫ్యాన్స్ పవన్ గనక ఈ సినిమా చేసి ఉంటే మరో లెవల్ లో ఉండేది అని అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ కేలవం ఈ సినిమానే కాదు అతడు సినిమాను కూడా మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట త్రివిక్రమ్ అతడు కథను పవన్ కు వినిపించగా కథ చెబుతున్న సమయంలోనే పవన్ నిద్రలోకి జారుకున్నారు. దాంతో త్రివిక్రమ్ అక్కడ నుండి వెళ్లిపోయారట.