Simhadri Movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సూపర్ హిట్ సినిమాల్లో సింహాద్రి ఒకటి. స్టూడెంట్ నెంబర్ 1 లాంటి హిట్ సినిమా అనంతరం రాజమౌళి – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో కమర్షియల్ గా మంచి హిట్ అందుకున్న తరువాత ఒక ఫాంటసీ సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారు రాజమౌళి. రాఘవేంద్రరావు కొడుకు సూర్య ప్రకాష్ తో ఆ సినిమా చేయాలని అనుకున్నారు.కానీ ఆ సినిమా బడ్జెట్ కారణంగా చర్చల దశలోనే ఆగిపోయింది.
అనంతరం రాజమౌళి తండ్రి కె.విజయేంద్ర ప్రసాద్ రాసిన సింహాద్రి కథను మొదట బాలకృష్ణతో చేయాలని అనుకున్నారు. దర్శకుడిగా బి.గోపాల్ కూడా ఫైనల్ అయ్యారు. కానీ అప్పట్లో బాలకృష్ణ వరుసగా అదే తరహా సినిమాలు చేస్తుండడం వలన రొటీన్ అవుతుందని జానర్ మార్చాలని అనుకున్నారు. అందుకే సింహాద్రి కథ అలా యూ టర్న్ తీసుకుంది. ఇక జక్కన్న ఓ సారి ప్రభాస్ కు ఈ సినిమా కథను కూడా వినిపించాడట. కానీ ప్రభాస్ మాత్రం సింహాద్రి సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశాడట. ఇక చివరగా జక్కన్న ఇదే కథను ఎన్టీఆర్ కు వినిపించారు. ఆయనకు నచ్చడంతో మూవీ సెట్స్ పైకి వెళ్లింది.
ఇక ఉహించినదానికంటే సినిమా కథ తెరపై చాలా అద్భుతంగా వచ్చింది. మొదటి రోజు సింహాద్రి మంచి టాక్ తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. రాజమౌళి – ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ కూడా ఒక్కసారిగా అకాశాన్ని తాకింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన భూమిక హీరోయిన్ గా నటించగా అంకిత మరో గ్లామత్ పాత్రలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక సినిమాకు కీరవాణి అంధించిన సంగీతం మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక మ్యూజిక్ కు తగ్గట్లుగానే ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు కూడా ఓ వర్గం వారిని మళ్ళీ థియేటర్స్ కు వచ్చేలా చేశాయి. ఈ సినిమా అప్పట్లో అత్యదిక సెంటర్లలలో 100రోజులు ఆడిన సినిమాల్లో కూడా స్థానం సంపాదించుకుంది.