Anchor Suma House : సుమ కనకాల.. బుల్లితెరపై ఏ షో అయినా, ఈవెంట్ అయినా మొదటగా వినిపించేది ఈ పేరే. సుమ కాదంటేనే ఆ ప్రోగ్రాం లేదా ఈవెంట్ వేరే యాంకర్ కి వెళ్తుంది. అంతలా తన యాంకరింగ్ తో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సుమ. నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేకపోయింది. బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి మాత్రం తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది. క్యాష్, స్టార్ మహిళ, జీన్స్, భలే ఛాన్స్ లే లాంటి టీవీ షోలతో యాంకర్ సుమ బుల్లి తెరపై తిరుగులేని రికార్డులు క్రియేట్ చేసింది.
ఇటీవల సుమ జయమ్మ పంచాయితీ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా ఆశించినమేరకు విజయం సాధించలేదు. కానీ సుమ నటనతో మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక సుమకు మాత్రమే కాకుండా ఆమె ఇంటికి కూడా ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా మంది స్టార్ హీరోల చిత్రాలలో సుమ ఇల్లు కనిపిస్తుంది. అలా టాలీవుడ్ లో ఏ ఏ సినిమాల్లో సుమ ఇల్లు కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం.
నాగచైతన్య హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 100% లవ్. ఈ సినిమా షూటింగ్ అధిక శాతం సుమ ఇంట్లోనే జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన బాద్ షా సినిమాలో కాజల్ అగర్వాల్ ఇల్లు కూడా సుమ సొంత ఇల్లే. అంతే కాకుండా దూకుడు సినిమాలో మహేశ్ బాబు ప్రకాష్ ఓ ఇంట్లో ఉంటారు. ఈ సినిమాలో ఇంటి ముందు చాలా సీన్లు ఉంటాయి. ఆ ఇల్లు కూడా సుమదే. అదేవిధంగా రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ, సునీల్ నటించిన పూలరంగడు చిత్రాలలోని ఇల్లు కూడా సుమాదే కావటం విశేషం. ఇలా చాలా సినిమాల్లో సుమ ఇంటిని షూటింగ్ నిమిత్తం ఉపయోగించారు. దీనికి గల కారణం సుమ ఇల్లు అందంగా, సినిమా షూటింగ్స్ కు అనువుగా ఉండటమే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…