పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రాలలో ఖుషి చిత్రం ఒకటి. ఈ మూవీ తమిళ చిత్రంకి రీమేక్‌గా రూపొందగా, ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన ఎస్ జె సూర్య తెలుగు వర్షన్ కి కూడా దర్శకత్వం వహించారు. ఏ ఎం రత్నం నిర్మాత. పవన్ కి జంటగా భూమిక కథానాయికగా నటించింది. సమ్మర్ కానుకగా 2001 ఏప్రిల్ 27న విడుదలైంది. ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాలో పవన్ – భూమిక కెమిస్ట్రీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇందులో నడుము సీన్ తెగ ఆకర్షించింది. ప్రతి ఒక్కరు కూడా రొమాంటిక్ సీన్‌కి కనెక్ట్ అయిపోయారు.
పవన్ ఏడవ చిత్రంగా విడుదలైన ఖుషి వసూళ్ల వర్షం కురిపించింది. నిర్మాతలు, బయ్యర్లు ఈ మూవీతో బాగా ఆర్జించారు. ఈ సినిమా తర్వాత పవన్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. అయితే ఈ మూవీ టైటిల్ విషయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఖుషి మూవీకి మొదట ‘చెప్పాలనివుంది’ అని అనుకున్నారట. దాదాపు కన్ఫర్మ్ అనుకున్న తర్వాత ఎందుకో క్యాచీగా ఉండాలని భావించిన మేకర్స్ ఆ టైటిల్‌ని వద్దని ఖుషీ పేరు పెట్టారు. ఇక ఈ టైటిలని వడ్డే నవీన్ వాడుకున్నారు. చంద్ర మహేష్ దర్శకత్వంలో వడ్డే నవీన్, రాశి ప్రధాన పాత్రలుగా చెప్పాలని ఉంది అనే సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక్కడ విశేషమేమంటే 2001 ఏప్రిల్ నెలలో ఖుషి విడుదల కాగా… వడ్డే నవీన్ నటించిన చెప్పాలనివుంది అదే ఏడాది ఆగస్టు నెలలో విడుదలైంది. అయితే ఖుషి చిత్రం భారీ హిట్ కాగా, చెప్పాలని ఉంది మాత్రం దారుణంగా నిరాశపరచింది. ఒకవేళ పవన్ ఆ టైటిల్ వాడుకొని ఉంటే సినిమా ఫ్లాప్ అయి ఉండేదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…