Pushpa : గత ఏడాది విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఎక్కడ విడుదలైనా తగ్గేదే లే అని సత్తా చూపించింది. పుష్ప- ది రైజ్ చిత్రం సూపర్ హిట్ కావడంతో పుష్ప 2 కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, పుష్ప 2 రిలీజ్ పై లేటెస్ట్ గా ఒక అప్ డేట్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పుష్ప 2 సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ అక్టోబరు నుంచి మొదలు కానుంది.
అయితే పుష్ప వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకునే ఛాన్స్ మిస్ చేసుకున్నారు ఆరుగురు ఆర్టిస్ట్‌లు. అందులో మహేష్ బాబు మొదటి స్థానంలో ఉన్నారు. ముందుగా ఈ ఆఫర్ మహేష్ దగ్గరకే రాగా, డీగ్లామర్ లుక్ కావడం వలన రిజెక్ట్ చేశాడట. దీంతో ఆ ఛాన్స్ అల్లు అర్జున్‌కి దక్కింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలంలో కథానాయికగా నటించిన సమంతని పుష్పలో కథానాయిక అనుకున్నాడట సుక్కూ. కానీ సమంత బిజీ షెడ్యూల్ వల్ల నో చెప్పడంతో రష్మికకు ఆఫర్ వచ్చింది.
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి.. ఫహాద్ ఫాజిల్ పాత్రలో నటించాల్సి ఉండగా, కొన్ని కారణల వలన చేయలేకపోయాడు. కమెడియన్ మహేశ్ విట్ట కూడా కేశవ అనే పాత్రకోసం పుష్ఫ ఆడిషన్స్ కు వెళ్లారట. కానీ ఆడిషన్స్ తరవాత మహేశ్ విట్ట ప్లేస్ లో బండారి జగదీశ్ ను సుకుమార్ ఎంపిక చేశాడు. ఇక ఈ సినిమాలో ఊ అంటావా.. ఊఊ అంటావా పాటతో సమంతకు ఎంత ప్రత్యేక గుర్తింపు దక్కిందో చెప్పనక్కర్లేదు. ఈ పాటకోసం సుకుమార్ ముందు దిశపటానిని అనుకున్నాడు. కానీ చివరికి సమంత స్టెప్పులు వేసింది. ఓ ముఖ్యమైన పాత్ర కోసం నారా రోహిత్‌ని కూడా అనుకున్నారట. కానీ మిస్ అయ్యాడు. ఇలా పలువురు నటీనటులు పుష్ప చాన్స్‌ను మిస్ చేసుకున్నారని చెప్పవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…