ఒకప్పుడు సినిమాలలో సత్తా చాటిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కొంతమంది అసలు ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఇక చాలా మందిని మనం మర్చిపోయాం కూడా. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన భామల్లో సాక్షి శివానంద్ ఒకరు. అప్పట్లో తన అందంతో వయ్యారంతో కుర్రకారును ఎంతగానో కట్టిపడేసింది ఈ భామ. మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం కాగా, ఆ తర్వాత ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లతో పాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా నటించింది ఈ భామ.
తెలుగు ,తమిళ్ ,కన్నడ ,హిందీ వంటి భాషలలో కూడా నటించిన సాక్షి శివానంద్ 2014 తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. 1996లో బాలీవుడ్లో మొదటిసారిగా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 98లో పలు చిత్రాలలో నటించి మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది. ఆట తర్వాత కొంతకాలం టాలీవుడ్ లో కూడా బాగా తన హవా కొనసాగించింది. అయితే ఏమైందో ఏమో కాని సడెన్‌గా సినిమాలకు దూరం అయింది.
రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు వంటి సినిమాలలో హీరోయిన్గా నటించిన సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు. సాక్షి శివానంద్ ను చూస్తే అసలు గుర్తుపట్ట లేకుండా ఉన్నారు అభిమానులు. ముఖ్యంగా ఈమె ఫేసులో అప్పటి అందం లేకపోవడంతో కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాక్షి శివానంద్ హీరోయిన్ స్టేజ్ దాటిపోయిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాక్షి శివానంద్ 1996లో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆమె కెరీర్ ప్రారంభంలో, ఆమె ఆదిత్య పంచోలి -నటించిన జంజీర్ (1998)లో నటించింది. ఆ తర్వాత ఆమె కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో పేరు తెచ్చుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…