Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. ఈ పేరు సంచలనం. ఆయన ‘మెగాస్టార్’ చిరంజీవి సోదరుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా తర్వాత తర్వాత తన టాలెంట్‌తో పవర్ స్టార్‌గా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ప్రతి సినిమాలోనూ తనలోని కొత్త వేరియేషన్స్ చూపిస్తూ.. ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పవన్ పేరు వింటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్.. ఓ సెన్షేషన్. ఆయన అంటే పడిచచ్చేవారు వారు ఎందరో ఉన్నారు. ఇందులో సినీ సెలబ్రిటీలు సైతం ఉండడం విశేషం. అయితే ప్రస్తుతం పవన్ సినిమాలు చేస్తూనే రాజకీయాలలోను తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే మొదట పవన్ కళ్యాణ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి చిరు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. చాలా మంది దర్శకులను చెక్ చేసుకున్న తరువాత చివరికీ ఈదర వీర వెంకట సత్యనారాయణ (ఈవీవీ) కుదిరాడు. పవన్ పోస్టర్ డిజైన్ కొత్తగా చేశారు ఈవీవీ. అయితే ఈ అబ్బాయి ఎవరూ అంటూ ఒక వాల్ పోస్టర్ సంధించారు. ఆ తరువాత సినిమా విడుదలకు ముందు ఇతడే మన పవన్ కల్యాణ్ అంటూ మరో పోస్టర్ విడుదల చేశారు. దీంతో అందరిలో ఆ అబ్బాయిపై ఆసక్తి పెరిగింది. చిరంజీవి తమ్ముడు అనే సరికి జనాలలో క్యూరియాసిటీ ఎక్కువైంది.
ఇక అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే ఒక పెద్ద ఈవెంట్‌ను జరిపి చిరంజీవి మెగాఫ్యాన్స్‌కు ఇతను నా తమ్ముడు అంటూ పరిచయం చేశాడు. తాజాగా ఇందుకు సంబంధించి పిక్ హల్‌చల్ చేస్తుంది. ఈ పిక్‌లో చిరంజీవి పవన్ కల్యాణ్‌తో పాటు నాగబాబు కూడా కనిపిస్తారు. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్‌కి షూటింగ్ జరిగినన్నీ రోజులు నెలకు రూ.5వేలు ఇచ్చారట నిర్మాత అల్లు అరవింద్. అక్టోబర్ 11, 1996లో విడుదల అయిన ఈ సినిమా 32 సెంటర్లలో 50 రోజులు, రెండు సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక అక్కడ నుండి మొదలైన పవన్ కళ్యాణ్ ప్రస్థానం భీమ్లా నాయక్ వరకు సాగింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…