Disha Patani : వరుణ్ తేజ్ నటించిన లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని. తొలి చిత్రంలోనే తన అందాలతో బాగానే ఆకట్టుకున్నా కూడా ఇక్కడ ఎందుకో అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ స్టార్ హీరోలతో జత కట్టింది. ఈ ముంబై భామ తర్వాత బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తోనూ బిజీగా ఉంది. ఇక టైగర్ ష్రాఫ్‌తో కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
గత 6 ఏళ్ల నుంచి ప్రేమలోఉన్న ఈ స్టార్ జోడీ.. ఇటీవల విడిపోయారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. టైగర్, దిశా జంటగా పార్టీలు, వెకేషన్స్ అంటూ తెగ తిరిగారు. ఆన్ స్క్రీన్‌లోనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ మోస్ట్ పాపులర్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఇక పెళ్లి పీటలు ఎక్కడమే తరువాయి అనుకున్న సమయంలో వీరిమధ్య మనస్పర్థలు తలెత్తాయట. ఈ కారణం వలన విడిపోయారని కొందరు జోస్యాలు చెప్పుకొచ్చారు. దీనిపై క్లారిటీ అయితే లేదు.
ఇక దిశా పటాని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేక పెట్టించే అందాలతో కుర్రకారుని మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది. తాజాగా ఫిల్మ్ ఫేర్ 2022 కోసం తెల్లటి దుస్తుల్లో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆ దుస్తులలోనే క్రేజీ ఫొటో షూట్ చేసింది. ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.
కొన్ని రోజులుగా దిశా పటానీ గ్లామర్ డోస్ పెంచుతూ ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారుతోంది. ఇక ఇన్నాళ్లు టాలీవుడ్, బాలీవుడ్ లో సత్తా చాటిన దిశా పటాని కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయినట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ సీనియర్ హీరో సూర్య సరసన నటించే చాన్స్ అందుకున్నట్టు సమాచారం. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఇందులో దిశాకి ఛాన్స్ దక్కినట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…