Dil Raju : తెలుగు బడా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు అనే విషయం తెలిసిందే సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలతో కూడా అలరిస్తున్నాడు. రీసెంట్‌గా బలగం అనే చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టి ఆశ్చర్యపరిచారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం వచ్చిన శాకుంతలం మాత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన శాకుతలంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన శాకుంతలం సినిమాను డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించగా, నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ చిత్రాన్ని నిర్మించారు. ఎపిక్ మైథాలాజికల్ మూవీగా తెరకెక్కిన శాకుంతలం సినిమా కోసం దిల్ రాజు రూ. 3 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలలో రూపొందిన సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ సినీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ విజువల్ గ్రాఫిక్స్ పై, మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతంపై విమర్శలు వచ్చాయి. దీంతో శాకుంతలం మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ ఇష్యూపై ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాకుంతలం సినిమా ఫలితంపై దిల్ రాజు స్పందించారు. శాకుంతలం సినిమా మిస్ ఫైర్ అయింది. సోమ, మంగళ వారాల్లో కలెక్షన్స్ రాలేదంటే అప్పుడే ఫిక్స్ అయిపోవాలి. రియలైజ్ కావాలి.
శాకుంతలం చిత్రం నాకు పెద్ద ఝలక్ ఇచ్చింది. నా 25 ఏళ్ల కెరీర్ లో ఇది ఎప్పుడూ ఊహించలేదు అని దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు . ప్రస్తుతం ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కాగా.. ఇదే ఇంటర్వ్యూలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లతో ప్రాజెక్ట్స్ ఖరారు అయినట్లు కూడా దిల్ రాజు తెలిపారు. కాగా, శాకుంతలం సినిమా ఫ్లాప్ కావడంపై స్పందించిన సమంత..‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే శ్లోకాన్ని ఇన్‌స్టాలో పెట్టింది. “పని చెయ్యి కానీ ప్రతిఫలం ఆశించకు” అని దీని అర్థం. ఆ టైమ్‌కు ఇది పెట్టిందంటే సినిమా ఫెయిల్యూర్ గురించే అని అందరు అనుకుంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…