Dhanush Sir Movie : ఓటీటీలో ధ‌నుష్ సార్ మూవీ.. చూసేయండిక‌..!

Dhanush Sir Movie : కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్ త‌న కెరీర్‌లో వైవిధ్య‌మైన చిత్రాలు చేసి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతున్న విష‌యం తెలిసిందే. తమిళ్‌లోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ ఆయ‌న‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన ప్రతి తమిళ్ సినిమాను తెలుగులో డబ్ చేస్తుండటం వల్ల టాలీవుడ్‌లో కూడా ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే పాన్ ఇండియా స్టార్‌గా మారిన‌ ధనుష్.. మొట్టమొదటిసారి తెలుగులో చేసిన స్ట్రెయిట్ చిత్రం ‘సార్’ . కార్పొరేట్ విద్యావవస్థపై ఒక సాధారణ యువకుడి పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాకు వెంకీ అట్లూరి అద్భుతంగా తెర‌కెక్కించారు. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ కోలీవుడ్‌లో మంచి వసూళ్లు రాబట్టింది.

చిత్రంలో సంయుక్త మేనన్‌ హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. స‌ముద్ర‌ఖ‌ని, హైప‌ర్ ఆది, తనికెళ్ళ భరణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అక్కినేని సుమంత్ కూడా ముఖ్య పాత్రలో మెరిశాడు. జీవీ ప్రకాశ్ స్వరాలు సమకూర్చగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన సార్‌ సినిమా ధనుష్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ ఓపెనింగ్స్‌ను తెచ్చుకుంది. చదువుకుందాం.. చదువు’కొన’కూడదు’ అని ధనుష్‌ చెప్పిన డైలాగులకు సినిమాలో విజిల్స్‌ పడ్డాయి. విద్యకు ఉన్న వ్యాల్యూ గురించి చర్చిస్తూనే మంచి మాస్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌కు చోటివ్వడంతో సార్‌ సినిమా మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది.

Dhanush Sir Movie streaming on march 17th 2023 on netflix
Dhanush Sir Movie

సార్ చిత్రం రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఇలా థియేటర్లలో సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న సార్‌ ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. తమిళ్‌లో ‘వాతి’ పేరుతో విడుదలైన సార్ మూవీ.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌పామ్ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్ వెర్షన్స్ రెండు కూడా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఒకేసారి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌స్తాయి.థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago