Deeksha Seth : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు దశాబ్దాలుగా కొనసాగుతుంటారు కానీ హీరోయిన్స్ మాత్రం మూడుపదుల వయసులోకి అడుగు పెట్టగానే తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. అదృష్టం బాగుంటే ఇంకో ఐదేళ్లు అంతే.. మరికొందరైతే ఒకటి, రెండు సినిమాలతోనే ఇలా వచ్చి అలా పోతుంటారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమందికి అదృష్టం మాత్రం అచ్చిరాదు. అలాంటి హీరోయిన్‌లలో దీక్షాసేథ్ ఒకరు అని చెప్పాలి. దీక్షా సేథ్ అనగానే ఈ హీరోయిన్ ఎవరు అనుకోవచ్చు.. కానీ, వేదం, రెబల్, మిరపకాయ్, వాంటెడ్ సినిమా హీరోయిన్ అనగానే టక్కున ఓ ఆ హీరోయినా అని అనేస్తారు.
మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ వేదం సినిమా తరువాత సెకండ్ హీరోయిన్ గా మిరపకాయ్, రెబల్ చిత్రాల్లో దర్శనమిచ్చింది. ఇక ఈ సినిమాలు అమ్మడికి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. తరువాత హీరోయిన్ గా వాంటెడ్, నిప్పు, ఊ కొడతావా.. ఉలిక్కి పడతావా లాంటి సినిమాలు చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీంతో టాలీవుడ్ కు నిదానంగా దూరమైంది. 2014లో లేకర్ హమ్ దివానా దిల్ అనే చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత వచ్చిన జగ్గు దాదా సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది హిందీలో మరొక సినిమాలో కూడా నటించింది. కానీ ఆ సినిమాలు దీక్షా కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు. ఈ సినిమాల తరువాత దీక్షాసేథ్ ఏ సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం ఈమె ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీక్షా గురించి చర్చ మొదలైంది. ఈమె ఎక్కడ ఉందో అని ఆరా తీస్తున్నారు. సినిమాలు వదిలేసినా కానీ అభిమానులకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉండి ఉంటే దీక్షాసేథ్‌కు కాస్త గుర్తింపు ఉండేదేమో అంటున్నారు నెటిజన్లు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…