Dasara Movie : తన కెరీర్ లో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో నాని. ఆయన నటించిన ‘దసరా’ చిత్రం రీసెంట్‌గా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల టేకింగ్ మరియు నాని అద్భుతమైన నటన ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది అనే చెప్పాలి. ఇందులో ఆడియన్స్ మెచ్చే విషయాలలో ఒకటి ఇంటర్వెల్ షాట్ కాగా మరొకటి క్లైమాక్స్. ఈ రెండు షాట్స్ ఐకానిక్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం మాత్రం ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ చేసేసింది.
నూతన దర్శకుడు ఇంత ప్రతిభ చూపించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ఈ సినిమా చూస్తుంటే ప్రేక్షకులకి ఆరు సినిమాలు గుర్తొస్తున్నాయి. ఆరు సినిమాలని కాపీ కొట్టి చిత్రం తీసాడా అనే భావన అందరిలో కలుగుతుంది. ముందుగా ఈ చిత్రం చూస్తే ‘రంగస్థలం’ సినిమా గుర్తుకొస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ లో హీరో స్నేహితుడిని చంపినప్పుడు ‘రంగస్థలం’ లో ప్రెసిడెంట్ ఎలా అయితే హీరో తమ్ముడిని చంపించాడో, అలా ఈ సినిమాలో కూడా హీరో స్నేహితుడిని ప్రెసిడెంట్ యే చంపించి ఉంటాడేమో అని మనందరికి అనిపిస్తుంది. కన్నడ డబ్బింగ్ మూవీ కాంతారా సినిమాలాదర్శకుడు క్లైమాక్స్ ప్లాన్ చేసుకోవడం, ఇక మగధీర సినిమాలోలా 100 మందిని నరుక్కుంటూ రెచ్చిపోయే సీన్లు, ఇక లగాన్ సినిమాలోలా క్రికెట్ టీంని గుర్తుకు తెచ్చే హీరో బలగం, వీటితోపాటు క్లైమాక్స్ లో రుద్రవీణ స్ఫూర్తితో ఒక చిన్న సీన్ ఇవన్నీ మిక్స్ చేసినట్టుగా ఉందని అంటున్నారు.
సిద్ధార్థ, శర్వానంద్ కలిసి తీసిన ఫ్లాప్ సినిమా మహాసముద్రంలో కొన్ని సీన్లు కూడా స్పుర్తిగా తీసుకొని సినిమా తీసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం కొన్ని ఫ్లాప్ సినిమాలని కూడా స్పూర్తిగా తీసుకున్నాడా అని అందరిలో అనేక ఆలోచనలు మెదులుతున్నాయి. ఏది ఏమయిన కూడా దర్శకుడు కొత్త వాడైన మాత్రం తొలి సినిమాతోనే మాత్రం ప్రేక్షకులని ఎంతగానో మెప్పించాడు అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…