Aishwarya Rajinikanth : కొద్ది రోజుల క్రితం రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో బంగారం నగలను పని మనిషి ఎత్తుకెళ్లిన విషయంలో కేసు నమోదు కాగా, . దీనిపై విచారణ చేసిన పోలీసులు.. మార్చి 31వ తేదీన పని మనిషి ఈశ్వరిని పట్టుకున్నారు పోలీసులు. విచారణ చేయగా దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొంగతనానికి కారణాలను వెల్లడించిన తీరు విని అందరు ఆశ్చర్యపోతున్నారు.
పనిమనిషి ఈశ్వరిని విచారించిన అనంతరం ఆమె ఇంట్లో 100 సవర్ల నగలు, 4 కిలోల వెండి, 30 గ్రాముల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈశ్వరి ఇంట్లో ఐశ్వర్య చెప్పిన దానికంటే ఎక్కువ నగలు ఉండడంతో పోలీసులకు అనుమానాలు తలెత్తాయి. దీనిపై ఐశ్వర్యను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఐశ్వర్య ఇంట్లోనే కాకుండా రజనీకాంత్, ధనుష్ ఇంట్లో కూడా ఈశ్వరి పని చేస్తున్నట్టు తేల్చారు. దీన్ని బట్టి రజనీ, ధనుష్ ఇంట్లో మిగిలిన నగలను ఈశ్వరి చోరీ చేసిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ సాగుతోంది.
అయితే సౌందర్య ఇంట్లో ఎందుకు దొంగతనం చేశావు అనే విషయంపై ప్రశ్నించగా, పని మనిషి ఈశ్వరి మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా ఐశ్వర్య ఇంట్లో పని చేస్తున్నాను. నెలకు కేవలం 30 వేల జీతం మాత్రమే ఇస్తారు.. ఈ 30 వేల రూపాయలతో ఎలా బతకాలి.. ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి.. జీతం తక్కువ కావటంతో దొంగతనం చేస్తున్నానంటూ యజమానులపైనే నెపాన్ని వేసింది ఈశ్వరి. జీతం బాగా ఇచ్చి ఉంటే.. దొంగతనం ఎందుకు చేస్తానంటూ బాగా కవర్ చేసుకుంది. కాగా, 18 ఏళ్లుగా నమ్మకంగా పని చేస్తుండటంతో.. ఐశ్వర్య ఇంట్లోనే కాకుండా ధనుష్, రజనీకాంత్ ఇళ్లల్లోనూ అప్పుడప్పుడు పని చేస్తూ ఉంటుంది ఈశ్వరి. అయితే దీనిపై నెటిజన్లు సైతం భిన్నంగా స్పందిస్తున్నారు.. 18 సంవత్సరాలుగా పని చేస్తుంటే.. ఓ సినీ సెలబ్రిటీ 30 వేల జీతమేనా ఇచ్చేది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…