Das Ka Dhamki : టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తన ట్యాలెంట్ చూపిస్తున్న విశ్వక్ సేన్ కొంత గ్యాప్ తరవాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోవడమే కాకుండా తాను నటించిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ సినిమా తన హోం ప్రొడక్షన్ లో రూపొందింది. స్క్రీన్ ప్లే, డైలాగ్, దర్శకత్వం అన్నీ తానై నడిపాడు. నివేతా పెత్తురాజ్ హీరోయిన్ గా నటించిన “దాస్ కా ధమ్కీ” ఉగాది సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కృష్ణ దాస్(విశ్వక్ సేన్) ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్ గా పని చేస్తూ ఉంటాడు.
అయితే జీవితంలో మంచి స్థాయిలో నిలవాలని కలలు కంటాడు. మరోవైపు ఎస్ ఆర్ ఫార్మా చైర్మన్ గా డాక్టర్ సంజయ్ రుద్ర విశ్వక్ సేన్ (రెండో పాత్ర) తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. . పేదరికం వల్ల పడే బాధల నుంచి బ్రేక్ తీసుకోవాలనే యావలో కృష్ణదాస్ డబ్బున్నవాడిగా బిల్డప్పివ్వాలనుకుంటాడు. పర్యవసానంగా కీర్తి (నివేతా పేతురాజ్) అతని ప్రేమలో పడుతుంది. తనని ఒక పెద్ద కంపెనీకి సీయీవోగా భావించిన ఆమె డేటింగ్ కూడా మొదలుపెడుతుంది. అసలు సీయీవో సంజయ్ (విశ్వక్ సేన్) రోడ్ యాక్సిడెంటులో చనిపోతే ఆ స్థానంలో నటించమని అడుగుతాడు సంజయ్ బాబాయ్ (రావు రమేష్). తర్వాత ఏం జరిగింది అనేది చిత్ర కథ.
ఈ సినిమలో విశ్వక్ సేన్ సాలిడ్ పెర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేస్తాడు. రెండు షేడ్స్ లో కూడా మంచి వేరియేషన్స్ ని ఎమోషన్స్ ని బాగా చేసాడు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికీ మంచి ట్రీట్ ఇస్తుంది. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్ లతో విశ్వక్ ల పలు కామెడీ సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి. అయితే మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన డ్యూయల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్ లో సినిమా కనిపిస్తుంది. దీనితో అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఈ సినిమా కథ పరంగా మెప్పించకపోవచ్చు. కీలకమైన సెకండాఫ్ లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.సంగీతం విషయానికొస్తే “పడిపోయానే పిల్లా” బాగుంది. ఇప్పటికే అది సూపర్ హిట్. ఐటెం సాంగ్ మాత్రం అవసరం లేని చోట అడ్డుగా ఉందని చెప్నాలి, కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఈ పండుగకి లేదా వారాంతానికి ఒక్కసారి అయితే ఈ సినిమా చూడవచ్చు.