Sudheer Varma : ఇటీవల రవితేజకి పెద్దగా సక్సెస్‌లు లేవనే చెప్పాలి. ఆయన తాజాగా రావణాసుర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ సాధించింది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్.. RT క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్ హీరోయిన్స్‌గా నటించారు. మరోవైపు సుశాంత్ మరో కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకుంది. మరోవైపు శాటిలైట్ రైట్స్ జీ టీవీ దక్కించుకుంది. స్ట్రీమింగ్ రైట్స్ దాదాపుగా రూ. 12 కోట్లకు పైగానే అమ్ముడు పోయినట్లు సమచారం.
ఈ సినిమా విడుదలైన 8 వారాల తర్వాత ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మెగా ఆకాష్‌లు నటించారు. అయితే చిత్రంలో రవితేజ పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. రొటీన్ రివేంజ్ స్టోరీని ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాని కాపీ అని అంటున్నారు. ఒక బెంగాలీ సినిమాతో పోలుస్తున్నారు. 2019 ఏప్రిల్ లో విడుదలైన విన్ సిడా అనే సినిమాకి దీనికి పోలిక ఉందని అంటున్నారు. ఈ సినిమాలో రెండు పాత్రలు ఉంటాయి.
ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి, మరొకరు మంచి టాలెంట్ ఉన్న మేకప్ ఆర్టిస్ట్. ప్రోస్తటిక్స్ తో ఒక ఫొటో చూసి వారిలా మాస్క్ రెడీ చేయగలడు. ఈ మేకప్ ఆర్టిస్ట్ ని అడ్డుపెట్టుకుని ఆది బోస్ అనే పాత్ర ఎక్కువగా హత్యలు చేస్తుంటుంది. ఆ విషయం తెలుసుకుని ఎలాగైనా అతని చెర నుంచి బయటపడాలని మేకప్ ఆర్టిస్ట్ చివరికి అతడిని హత్య చేస్తాడు. ఈ కథనే సుధీర్ వర్మ రావణాసురగా తెరకెక్కించాడు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ కథ నుంచి సోల్ మాత్రమే తీసుకుని సుధీర్ వర్మ ఒక పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాని తెరకెక్కించాడు. రవితేజలాంటి యాక్టర్ తో యాక్టింగ్ కి మంచి స్కోప్ ఉన్న పాత్రను డిజైన్ చేసి సుధీర్ వర్మ చెప్పిన కథ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే చిత్రాన్ని కాపీ అనడంపై కొందరు ఫైర్ అవుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…