Colors Swathi : యాంకర్‌గా ప్రస్తానం మొదలు పెట్టి ఆ తర్వాత నటిగా మారిన స్వాతి పెళ్లి తర్వాత సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తుంది. ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంలో కథానాయికగా స్వాతి నటించగా, ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్‌గా జరిగింది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి సాయిధరమ్ తేజ్ గెస్ట్‌గా హాజరు కాగా, ఈ ఈవెంట్‌లో కలర్స్ స్వాతి మాట్లాడుతూ.. సాయిధరమ్ తేజ్‌తో స్నేహం గురించి వెల్లడించారు. వేదిక మీదే సాయిధరమ్ తేజ్‌ను ఒరేయ్ అని పిలిచేంత చనువు వీళ్లిద్దరి మధ్య ఉంది. స్వాతి మైక్ పట్టుకుని వెనక్కి వెళ్తుంటే.. ఆమె వెనకే ఉన్న సాయిధరమ్ తేజ్.. ముందుకు వెళ్లు అంటూ తోశారు.
దీంతో స్వాతి.. ‘ముందుకు వెళ్లడం కాదురా, నువ్వు నా వెనకాల ఎప్పుడూ ఉన్నావ్. మేమిద్దరం కలిసి చదువుకున్నామండి. నేను తనకంటే పెద్దదాన్ని అని మీరందరూ అనుకుంటున్నారని నాకు తెలుసు. కానీ మేమిద్దరం కలిసి బీఎస్సీ చదువుకున్నాం’ అని చెప్పారు. వెంటనే మైక్ అందుకున్న సాయిధరమ్ తేజ్ సరదాగా మాట్లాడుతూ.. ‘అప్పుడు వెనకాల ఎందుకు ఉన్నానంటే పేపర్ చూపిస్తుందని. అప్పుడు నాకేం చూపించలేదు. బుక్ ఒళ్లో పెట్టుకుని రాశాను.. దొరికాను. అది ఎవరి తప్పు. నీ తప్పు. నువ్వు పేపర్ చూపించలేదు’ అని అన్నారు. వెంటనే స్వాతి.. ‘ఇద్దరి పేర్లు Sతో ప్రారంభమవుతాయి కాబట్టి ప్రాక్టికల్స్‌లో కూడా ఇద్దరం పక్కపక్కనే ఉండేవాళ్లం’ అని చెప్పారు. ‘టార్చర్ అండి పేపర్ చూపించదు.. ఏమీ చెప్పదు’ అని తేజూ అన్నారు. ‘అన్నీ అబద్ధాలే.. పాసయ్యిందే నా వల్ల’ అంటూ స్వాతి కౌంటర్ ఇచ్చారు.
అయితే, సాయిధరమ్ తేజ్ ఇప్పుడు సరదాగా పిచ్చి జోకులు వేస్తున్నాడు కానీ.. అతను తనకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉన్నాడని స్వాతి చెప్పారు. ఆ తరవాత సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘మీ అందరికీ కలర్స్ స్వాతి అని తెలుసు. నాకైతే స్వాతి గాడే. స్వాతి నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. నా కోసం ఎప్పుడూ ముందుంటుంది’ అని స్వాతికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. దీనికి స్వాతికి స్పందిస్తూ సాయిధరమ్ తేజ్‌కు బుగ్గపై ముద్దు పెట్టారు. ఇప్పుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…