VVS Laxman : శ్రీలంక క్రికెట్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘800’. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి క్రికెటర్స్ మురళీధరన్, వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యి సందడి చేశారు. అయితే బంతితో బ్యాట్స్‌మెన్లను గడగడలాడించిన ముత్తయ్య మురళీధరన్ టెస్ట్ క్రికెట్‌లో ఎవరూ అందుకోలేని విధంగా 800 వికెట్ల తీసి చరిత్ర సృష్టించాడు. అలాంటి గొప్ప స్పిన్నర్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ 800 మూవీ అక్టోబర్ 6వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదల అవుతున్నది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు నిర్వహిస్తున్న ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో జరిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వీవీఎస్ లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ముత్తయ్య మురళీధరన్‌తో ఉన్న అనుబంధాన్ని, అనుభూతులను వీవీఎస్ లక్ష్మణ్ పంచుకొన్నారు. మైదానంలో మురళీధరన్ సాధించినది మాత్రమే కాదు, అతని జీవితమంతా స్పూర్తిదాయకం. బాల్యం నుంచి క్రికెట్ రంగం వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా అందరికి స్పూర్తిని కలిగిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మురళీధరన్ మెంటార్ కూడా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది అని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పారు.
మురళీధరన్‌తో కలిసి ఇంగ్లీష్ కౌంటీలో లాంక్‌షైర్ తరుపున క్రికెట్ ఆడినట్టు కూడా చెప్పుకొచ్చాడు లక్ష్మణ్. భారత్, శ్రీలంక జట్ల తలపడితే.. ప్రత్యర్థిగా కూడా ఆడాను. కేవలం ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగతంగానూ అతనితో పరిచయం ఉంది. మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. అంత కంటే గొప్ప మనసు ఉన్న వ్యక్తి, గర్వం ఏ కోశాన కనిపించదు. ఈ తరం యువతకు, క్రికెటర్లకు రోల్ మోడల్. నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అతనిలాంటి ఫ్రెండ్ ఉండటం లక్కీ. ముత్తయ్య మురళీధరన్‌కు క్రికెట్ జీవితం అని వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. ఒకసారి నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ తినిపిస్తావా? అని లక్ష్మణ్ అడిగితే.. అరగంటలో విమానంలో చాలా బిర్యానీలు తెప్పించి పెట్టరు. లక్ష్మణ్ అంటే అది” అని మురళీధరన్ చెప్పారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…