CM YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఎట్టకేలకి ముగిసింది. ఈ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్న నేపథ్యంలో జగన్ ఉదయమే రాష్ట్రానికి చేరుకున్నారు. ఎన్నికల తుది ఫలితాలకు సమయం దగ్గర పడిన తరుణంలో బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర , రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నేతలు ఘనస్వాగతం తెలిపారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డిని స్వాగతించారు. ఆపై ఆయన ఇక్కడి నుండి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.
ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంతో మే నెల 17వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్లారు. లండన్, స్విట్జర్లాండ్ దేశాలలో పర్యటించిన ఆయన 15 రోజుల పాటు కుటుంబంతో గడిపారు. ఇక నేటి నుంచి మళ్లీ రాజకీయాలలో బిజీ కానున్నారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక జగన్ తన సోషల్ మీడియా ద్వారా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.గతంలో 2019లో గెలిచి ఇదే రోజున ప్రమాణస్వీకారం చేసిన జగన్.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఓ ట్వీట్ చేశారు. అందులో అప్పట్లో ప్రమాణ స్వీకారం చేసిన ఫొటోను పెట్టి ఈసారి ఫలితాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సరిగ్గా ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో అదే మరోసారి జరగబోతోందని సీఎం జగన్ హింట్ ఇచ్చేశారు. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.” అంటూ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…