CM YS Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నాలుగో విడత సిద్ధం బహిరంగ సభను నిర్వహించింది.రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ పొత్తు అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిన నేపథ్యంలో సిద్ధం బహిరంగ సభను మరింత ఆసక్తికరంగా మార్చివేశాయి. అందరి దృష్టీ దీని మీదే నిలిచింది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నేత సీఎం జగన్‌ను చూసేందుకు ఆయన చెప్పే మాటలను వినేందుకు ప్రజలు తరలి వచ్చారు. మొత్తంగా 15 లక్షల మంది సిద్ధం సభకు హాజరై గ్రాండ్ సక్సెస్ చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
గ్రీన్ మ్యాట్ వేసి అక్కడ చాలామంది ప్రజలు వచ్చినట్లుగా టీడీపీ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. అయితే అసలు జనాలు ఎంతమంది వచ్చారో ప్రత్యక్షంగా చూసేందుకు సభాస్థలికి రావాల్సిందిగా వైసీపీ ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. చివరి సభ కావడంతో పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభను అనుకున్న విధంగానే సక్సెస్ చేసింది. దీంతో వైసీపీ క్యాడర్‌లో మరింత జోష్ పెరిగింది. సీఎం జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే సీఎం సీఎం అనే నినాదాలు మిన్నంటాయి. దాదాపు గంటకు పైగా సాగిన సీఎం జగన్ ప్రసంగం పై అక్కడికొచ్చిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తనను ఓడించేందుకు చంద్రబాబు అండ్ కో మరో జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని.. అయితే తన పొత్తు మాత్రం ప్రజలతోనే ఉంటుందని సీఎం చెప్పినప్పుడు అక్కడికి వచ్చిన ప్రజలు చప్పట్లు కొట్టారు.
సభ ప్రారంభానికి ముందు ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. దీనిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. లోకేష్ ఇలాంటి ట్రిక్కులు ఎన్ని చేసినా వాటిని తొక్కిపడేస్తామని అనిల్ ధ్వజమెత్తారు.దమ్ముంటే సభాస్థలికి వచ్చి జగన్‌ను ప్రేమించే వారు ఎంతమంది వచ్చారో ప్రత్యక్ష్యంగా చూడాలని అన్నారు. అయితే టీడీపీ నాయకులు దీనిని గ్రాఫిక్ షొ అంటున్నారు. సభపై పలు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…