CM YS Jagan : ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున సుమారు 5.30 గంటలకు ఒక ఫంక్షన్ హాలులో బసచేసిన చంద్రబాబును అక్కడే అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీఐడీ చంద్రబాబుపై ఏ1గా కేసు నమోదుచేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్-1988 కింద చంద్రబాబును అరెస్టుచేశారు. దాదాపు రు. రూ.371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్టు చేస్తారని ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. అయితే చంద్రబాబు తన కెరీర్‌లో ఇంత వరకు అరెస్ట్ అయింది లేదు.
గతంలో ఆయనపై పలు కేసులు నమోదు అయిన కూడా ఏ నాడు అతనిని అరెస్ట్ చేసింది లేదు. కాని జగన్ తాను 2015లో అసెంబ్లీలో చాలా ఆగ్రహంగా మాట్లాడుతూ.. తాను సీఎం అయితే చంద్రబాబు తప్పులన్నింటిని బయటపెడతాను. ఆయన అరెస్ట్ చేస్తానని గట్టిగా చెప్పారు. అన్నట్టుగానే ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందు చంద్రబాబుని అరెస్ట్ చేసి చూపించాడు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే. సాక్ష్యాలు, ఆధారాలు చూసి కోర్టు బాబును రిమాండ్‌కు పంపింది. మనం ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నామో ఆలోచించండి. బాబు హయాంలో వందల కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది?. చంద్రబాబును కాకుండా ఎవరిని అరెస్టు చేయాలి?. చంద్రబాబు ప్రభుత్వం, మా ప్రభుత్వ తేడాను గమనించండి న్యాయం, ధర్మం మా పక్షాన ఉన్నాయి. జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం అని జగన్ అన్నారు.
ఇది ఒక కుట్ర అని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్. ఇందులో భాగంగా ఈ కుట్ర వెనుక.. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. ఏపీలో వైఎస్ జగన్ గెలవడం కోసం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేశారనేది విధితమే అని చెప్పుకొచ్చిన మధుయాష్కీ… చంద్రబాబుపై మోడీకి దుష్మనీ లాంటిది ఉందని వ్యాఖ్యానించారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారంటే దాని వెనుక కుట్ర ఉందని, తనకు సమాచారం ఉందని, ఈ అరెస్ట్ వెనుక మోడీ, కేసీఆర్ లు ఉన్నారని తెలిపారు.