CM Revanth Reddy : ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పలు అంశాల గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ప్రస్తావిస్తూ ఆ విషయంలో గొడవకి కూడా దిగుతున్నారు. రీసెంట్‌గా అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో ఇక నుండి డ్రగ్స్ అనే మాట వినపడకూడదని అన్నారు. ఐదు కీలక శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, నార్కోటిక్ అండ్ డ్రగ్స్, ఎక్సైజ్, టీఎస్‌పీఎస్సీ, సింగరేణిలపై సమీక్ష నిర్వహించారు. నార్కోటిక్ అండ్ డ్రగ్స్‌పై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… మన రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడవద్దన్నారు. ఇక నుంచి ప్రతి నెల నార్కోటిక్ బ్యూరోపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీపై మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో దొరుకుగుతున్న డ్రగ్స్ కు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. డ్రగ్స్ కు సంబంధించి సిట్ ఏర్పాటు చేసి, ఆ అధికారిని అర్ధాంతరంగా ఎక్కడికి పంపించారని ప్రశ్నించారు. విచారణలో లోపాలను బయటపెట్టడానికి గతంలో హైకోర్టును ఆశ్రయించామన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా గత ప్రభుత్వం డ్రగ్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, హార్డ్ డిస్కులను ఈడీకి ఇవ్వలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించిన మాట నిజం కాదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. పంజాబ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ నాశనం చేసిందని, పేద మహిళలు సైతం కుటుంబంలో మగవారికి డ్రగ్స్ కోసం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. కనుక రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లాంటివి లేకుండా చూడాలని, వారి వెనుక ఎంత పెద్దవారున్నా బయటకు లాగి చర్యలు తీసుకుందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుండగా, ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ మంచి విషయంపై చర్చించేందుకు కేటీఆర్ మైక్ అడిగి ఉంటే బాగుండేదని రేవంత్ అన్నారు. అయితే దీనిపై స్పందించిన కేటీఆర్.. డ్రగ్స్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసిందన్నట్లు మాట్లాడుతున్నారు, కానీ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడే టీఎస్ న్యాబ్ ను అడిషనల్ డీజీపీ స్థాయి వ్యక్తి సీవీ ఆనంద్ ను అపాయింట్ మెంటె చేశామన్నారు. పంజాబ్ లో నిన్న మొన్నటివరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ కు తెలియదన్నారు. ఉడ్తా పంజాబ్ అనే సినిమా కూడా పంజాబ్ లో డ్రగ్స్ సమస్యపై వచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. డ్రగ్స్ పై చర్యలు, ఉక్కుపాదం మోపాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకుండా యాంటో నార్కోటిక్ బ్యూరో లాంటివి ఎందుకు ఏర్పాటు చేస్తాం, సీవీ ఆనంద్ లాంటి అధికారికి బాధ్యతలు ఎందుకు అప్పగిస్తామన్నారు కేటీఆర్.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…