CM Revanth Reddy : భారత ప్రభుత్వం ప్రకటించే అత్యుత్తమమైన అవార్డుల్లో పద్మ పురస్కారాలు ప్రత్యేకమైనవి అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రకటిస్తుంటుంది. ఇక, ఈ సంవత్సరానికి గానూ ఇటీవలే పద్మ అవార్డులను ప్రకటించగా, ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును అనౌన్స్ చేసారు. దీనిపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు. ఇక అవార్డు ప్రకటన సందర్బంగా చిరంజీవి విందు ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి కొనియాడారు. చిరంజీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తనను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
పద్మ విభూషణ్ అవార్డుతో ఫుల్ జోష్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. ఇందుకోసం ఏర్పాటు చేసిన పార్టీలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులను ఆహ్వానించారు. ఇందులో భాగంగానే దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరై.. ఈ స్పెషల్ పార్టీలో తెగ సందడి చేశారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు విందుకు హాజరైన రేవంత్ రెడ్డి ముందుగా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ ఆప్యాయంగా మాట్లాడారు. వీళ్లిద్దరూ చాలా సేపు ముచ్చటిస్తూ కనిపించారు. అనంతరం విందు ఆరగించారు.
మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సందర్భంగా రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ‘శ్రీ చిరంజీవి గారికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం, వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని చెప్పారు. దీనికి బదులుగా చిరంజీవి ‘నన్ను అభినందించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు’ అని చెప్పారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. అలాగే, కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. అవి నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. 2006 కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఇక ఇప్పుడు చిరంజీవితో పాటు ఉపరాష్ట్రపతిగా సేవలందించిన వెంకయ్య నాయుడు సైతం పద్మవిభూషణ్ అందుకోనున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…